Switch to English

దారుణం: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

గుంటూరు నగరంలో దారుణం జరిగింది. బీటెక్ చదువుతుతున్న రమ్య అనే విద్యార్దినిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసాడు ఓ యువకుడు. హత్య చేసిన అనంతరం యువకుడు సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. స్థానిక కాకాని రోడ్డులోని పరామయకుంటలో ఈ దారుణ ఘటన జరిగింది. నల్లపు రమ్య సెయింట్ మేరీస్ కాలేజిలో బిటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. విద్యార్థినిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది వైద్యులు నిర్ధారించారు. జిజిహెచ్ లో విద్యార్థి మృతదేహాన్ని అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు. ఈ దారుణ ఘటన ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

రమ్య హత్య ఘటనపై హోం శాఖ మంత్రి సుచరిత విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధినిని హత్య చేయడం చాలా బాధాకరమని.. ఇది హేయమైన చర్య అని అన్నారు. జీజీహెచ్‌లో రమ్య మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. ‘‘నిందితుడి గురించి పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితుడిని ఇవాళో, రేపో పట్టుకుంటాం. విచారణ త్వరగా పూర్తి చేసి హంతకుడికి శిక్ష పడేలా చూస్తాం. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. రమ్య ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేస్తే సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యకు ముందు యువతితో నిందితిడు ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. మహిళలను చంపే హక్కు ఎవరికీ లేదు. ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ.. ఉన్మాదుల్లా హత్య చేయడం అత్యంత దారుణం’.

‘చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. ఉన్మాదంతో దారుణాలకు తెగబడుతున్న ఇలాంటి ఉన్మాదులకు ఉరిశిక్షే సరైన శిక్షలా అనిపిస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై సీఎం జగన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రమ్య ఫోన్ అన్ లాక్ చేసిన తర్వాత మరింత సమాచారం తెలుస్తుంది. రమ్య కుటుంబసభ్యులను, స్నేహితులను కూడా విచారిస్తున్నాం’ అని అన్నారు.

హత్య కు గురైన రమ్య మృతదేహాన్ని మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ పరిశీలించారు. స్వాత్రంత్ర దినోత్సవం రోజున ఈ దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని వాసిరెడ్డి పద్మ అన్నారు. రమ్య మెడపైన, పొత్తి కడుపులో ఆరు చోట్ల కత్తితో తీవ్రంగా గాయపరచడం వల్ల రమ్య వెంటనే చనిపోయిందని.. ఆమెకు పరిచయస్థుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోందని అన్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...