Switch to English

రఘురామ సంగతి సరే.. విజయసాయిరెడ్డి సంగతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎంత హాస్యాస్పదంగా వుంటాయో చెప్పడానికి లక్షలాది, కోట్లాది ఉదాహరణలు కన్పిస్తాయి. అయినా, జనం ఎందుకు తీవ్రమైన ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని రాజకీయాల్లో అందలమెక్కిస్తుంటారు.? ఇది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. అసలంటూ ప్రజల్లో మార్పు వస్తే, రాజకీయాల్లోకి నేరచరితులు ఎందుకొస్తారు.? ఛాన్సే లేదు. అంటే, అసలు లోపం ప్రజల్లో వుందన్నమాట. అసలు విషయంలోకి వద్దాం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్ట అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు ఏళ్ళ తరబడి నడుస్తోంది. ఆయన నిందితుడా.? నేరస్తుడా.? అన్న విషయమై భిన్న వాదనలు వినిపిస్తూనే వున్నాయి.. వినిపిస్తూనే వుంటాయి. ప్రజా కోర్టులో గెలిచాం.. అని వైసీపీ చెప్పుకుంటోంది. కానీ, కోర్టులు ఇంకా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికిగానీ, ఇదే కేసులో విజయసాయిరెడ్డికిగానీ, మిగతావారికిగానీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

విజయసాయిరెడ్డి ఇటీవల విదేశాలకు వెళ్ళేందుకోసం కోర్టు నుంచి అనుమతి కోరాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయసాయిరెడ్డే ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద ఆరోపణలు చేస్తున్నారు. విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్టు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం.

రఘురామకృష్ణరాజు ఎంపీ అయ్యిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పటికే ఆయన మీద పలు కేసులున్నాయి. అప్పుడేమో రఘురామకృష్ణ, వైసీపీ అధిష్టానానికి ‘సుద్ద పూస’లా కనిపించారు. ఇప్పుడేమో, బ్యాంకుల్ని ముంచేసి విదేశాలకు పారిపోవాలని చూస్తోన్న దొంగలా కనిపిస్తున్నారు. అంటే, ప్రజలు వెర్రి వెంగళప్పలనే కదా.. రాజకీయ నాయకుల అర్థం.?

తాము ఏం చెబిదే అదే జనం గుడ్డిగా నమ్ముతారన్న గట్టి నమ్మకం రాజకీయ పార్టీలది. నిజమే, రఘురామ మీద ఆరోపణలున్నాయి. మరి, ఆయనకెందుకు టిక్కెట్ ఇచ్చినట్లు.? నిజమే, విజయసాయిరెడ్డి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసులున్నాయి.. మరెందుకు వైసీపీలో రఘురామ చేరినట్లు.? అందరూ కలిసి డ్రామాలాడుతూ ప్రజల్నే వెర్రి వెంగళప్పల్ని చేసేస్తున్నారు మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...