Switch to English

జగనన్న రాజ్యాంగం: గోడు వెల్లబోసుకుంటే.. గూడు కూల్చేశారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

అక్రమ కట్టడాల పేరుతో కూల్చేడే తప్ప.. కట్టుడు ఆలోచన అధికార వైసీపీకి లేదా.? జగన్ హయాంలో కూలినవెన్ని.? కడుతున్నవెన్ని.? ఓ యువతి, ప్రభుత్వ దాష్టీకాన్ని నిరసిస్తూ, విపక్ష నేతల వద్ద తన ఆవేదనను వెల్గగక్కుకుంటే, ఆమెపై దాడి చేయడమే బులుగు రాజ్యాంగమా.? ఇదెక్కడి పైత్యం.? మీకు పట్టా ఇచ్చేశాం.. ఇల్లు కూడా మంజూరు చేసేశాం.. వెంటనే ఇల్లు ఖాళీ చేసెయ్యాల్సిందేనంటూ అధికారులు హుకూం జారీ చేయడం, ఆ వెంటనే గూడు కూలగొట్టేయడం.. అసలేం జరుగుతోంది రాష్ట్రంలో.?

శివశ్రీ అనే మహిళ, వాలంటీర్‌గా కూడా పనిచేసింది. తమ ప్రభుత్వ హయాంలో వాలంటీర్‌గా పనిచేసిందన్న కనీసపాటి గౌరవం కూడా లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆమె ఇంటిని ఆగమేఘాల మీద కూల్చేయడమేంటో.. ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కలిసి గోడు వెల్లగక్కుకున్నాకే, ఆమెపై అధికార పార్టీ కక్ష కట్టడమేంటో.. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాజ్యాంగం అమలవుతుందోనన్న విమర్శ సర్వత్రా వినిపిస్తోంది.

మహిళోద్ధారకులం మేమే.. అని అధికార పార్టీ చెప్పుకుంటోంది. కానీ, ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే.. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటాయి. ఓ మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు.. ఆమెకు విపక్షాలు అండగా నిలిచినందుకు.. ఆ మహిళ నివసిస్తున్న ఇంటిని రాత్రికి రాత్రి జేసీబీలతో అధికారులు పడగొట్టేస్తారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతున్న అత్యద్భుతమైన పాలన.

అధికార పార్టీ దాష్టీకం ఇలా వుంటే, జనసేన పార్టీ.. ఆ బాధిత మహిళకు అండగా నిలిచింది. బాధిత కుటుంబం సరైన నివాసం వెతుక్కునేవరకూ తాను ఆశ్రయం కల్పిస్తానంటూ జనసేన పార్టీకి చెందిన నేతలు ముందుకొచ్చారు. అసలు ఈ దాష్టీకం ఎందుకు జరిగింది.? అంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వెనుక కాలువ కట్టపై వుంటోన్న పేదల ఇళ్ళ కారణంగా భద్రతా సమస్యలు.. ముఖ్యమంత్రిగారికి ఎదురవ్వొచ్చనే భయం ప్రభుత్వ పెద్దల్లో వుండడమేనట. అంటే, పేదలిక్కడ మనుషులే కారన్నట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారనుకోవాలి.

మొత్తం 317 కుటుంబాలు నివసిస్తున్న అమరారెడ్డి నగర్ కాలనీని అధికారులు ఖాళీ చేయించేశారు. ఒక్కరి కోసం.. 317 కుటుంబాల్ని ఖాళీ చేయించడమంటే.. చాలా చాలా గొప్ప విషయమే మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...