Switch to English

జాగిలం వర్సెస్ కుక్క: జగన్ సర్కారుకి వెన్నుపోటు కాదు కదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

వైసీపీకి చెందిన ముఖ్య నేత ఆయన. గత కొద్దికాలంగా ఆయన వ్యవహార శైలి పట్ల పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘వాలంటీర్ పోస్టుల్లో 90 శాతం మన పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నాం..’ అని చెప్పినప్పటినుంచి అధికారికంగా మొదలైంది ఆయనగారి వెన్నుపోటు. ‘విశాఖ అంటే నేనే.. నేనంటేనే విశాఖ..’ అనే స్థాయికి ఆయన సొంత పబ్లిసిటీ పెంచుకోవడం షురూ చేయడంతో పార్టీలోని కొందరు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఫలితంగా, వైసీపీలో నెంబర్ టూ పొజిషన్ నుంచి ఆయనగారిప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితం కావాల్సి వచ్చింది. మన్సాస్ ట్రస్ట్ విషయమై మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై ‘దొంగ’ అనే ముద్ర వేయడానికి నానా పాట్లూ పడుతున్నాడాయన. ఈ వ్యవహారంపై క్షత్రియ సామాజిక వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ‘ఇది ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని నడుపుతున్న దుష్ప్రచారంలా వుంది..’ అంటూ వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నాయి క్షత్రియ సంఘాలు. తన స్థాయిని తగ్గించుకుని.. కాదు కాదు, పాతాళానికి పడేస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు సదరు వైసీపీ ముఖ్య నేత.

తాజాగా ‘జాగిలం.. కుక్క..’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్ వేశారు. పెంపుడు కుక్క జాగిలం అయితే.. వీధిలో కుక్కల్ని.. గజ్జి కుక్క.. అని పోల్చారన్నమాట సదరు వైసీపీ ముఖ్య నేత. ఇంత దిగజారుడుతనమా.? ఇదంతా చేసి వైసీపీ మీద జనంలో ఏహ్యభావం పెరిగిపోతోంది. రోజురోజుకీ సదరు వైసీపీ ముఖ్య నేత మాటల తీరు అత్యంత జుగుప్సాకరంగా మారుతుండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఆయన మా పార్టీ ముఖ్య నేత అయినంత మాత్రాన.. ఆయన చేసే ప్రతి చెత్త పనినీ వెనకేసుకురాలేం.. అధినేత దృష్టికి అన్ని విషయాలూ తీసుకెళతాం..’ అంటున్నారు వైసీపీకి చెందిన కొందరు క్షత్రియ సామాజిక వర్గ నేతలు. ఆ నేతల చొరవతోనే, క్షత్రియ సంఘాలు ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది కూడా.

‘ఇది నిఖార్సయిన వెన్నపోటు.. ఆయన్ని కట్టడి చేయాల్సిందే..’ అంటూ కేవలం క్షత్రియ సామాజిక వర్గమే కాకుండా, ఇతర సామాజిక వర్గాలకు చెందిన సంఘాల తాలూకు వైసీపీ నేతలూ గుస్సా అవుతున్నారట. ఇంతకీ, ఇక్కడ జాగిలం ఎవరు.? గజ్జి కుక్క ఎవరు.? జాగిలం అన్నా.. గజ్జి కుక్క అన్నా.. ఒకటే.. తమను తాము ‘కుక్క’ అని పిలిపించుకోవడానికి సైతం సిగ్గుపడని స్థాయికి అధికార పార్టీలో కొందరు నేతలు దిగజారిపోవడాన్ని ఏమనుకోవాలి.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....