Switch to English

‘ఏక్ మినీ కథ’ రివ్యూ – ఇదొక బోరింగ్ లంబీ కహాని.!

Critic Rating
( 2.00 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow
Movie ఏక్ మినీ కథ
Star Cast సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధ దాస్, బ్రహ్మాజీ
Director కార్తీక్ రాపోలు
Producer యువి కాన్సెప్ట్స్
Music ప్రవీణ్ లక్కరాజు
Run Time 2 గంటల 14 నిమిషాలు
Release మే 27, 2021

తను నేను, పేపర్ బాయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శోభన్ హీరోగా కావ్య తాపర్ హీరోయిన్ గా నటించిన సినిమా  ‘ఏక్ మినీ కథ’. యువి క్రియేషన్స్ నిర్మాణంలో, మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు, ప్రభాస్, రామ్ చరణ్ ప్లంటి స్టార్ హీరోల సపోర్ట్ తో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ స్కిప్ చేసి నేడు డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజయ్యింది. మరీ ఈ ఏక్ మినీ కథ ఎంటర్టైన్ చేసిందో లేదో చూద్దాం..

కథ:

సంతోష్ (సంతోష్ శోభన్) కి చిన్నప్పటి నుంచే తన పురుషాంగం చాలా చిన్నదిగా ఉందనే ఆత్మ నూన్యతా భావంతో ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎలా పెంచుకోవాలో తెలియక చాలా బాధ పడుతుంటాడు. అందుకే సంతోష్ పెళ్లి అనే విషయానికి కూడా దూరంగా ఉంటాడు. కానీ అమృత (కావ్య థాపర్) ని చూసాక ప్రేమలో పడడం, తను కూడా సంతోష్ ని ప్రేమించడం, అనుకోకుండా పెళ్లి.. ఇలా అన్నీ చకచకా జరిగిపోతాయి కానీ అక్కడే సమస్య మొదలవుతుంది. అమృతకి అన్నీ బిగ్ సైజ్ లో ఉండడమంటే ఇష్టం. దాంతో సంతోష్ లో భయం ఇంకా పెరిగిపోతుంది. తన సమస్య చెప్పుకోలేక, ఆ సమస్య పరిష్కరించుకోవడానికి సంతోష్ పడ్డ ఇబ్బందులేమిటి? చివరికి సంతోష్ సమస్యకి పరిష్కారం దొరికిందా? లేక అమృతకి విషయం తెలిసిపోయిందా? తెలిసిపోతే ఎలా రియాక్ట్ అయ్యింది? అనేదే కథ.

తెరమీద స్టార్స్..

ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో సంతోష్ శోభన్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిన సినిమా ఇదని చెప్పచ్చు. పురుషాంగం విషయంలో ఆత్మ నూన్యతా భావంతో బాధపడే కుర్రాడి పాత్రలో పలు చోట్ల తన హావభావాలతో నవ్విస్తాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ సూపర్బ్. తనకిచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. కావ్య థాపర్ చూడటానికి నాజూగ్గా, సింపుల్ అండ్ స్వీట్ గర్ల్ గా కనిపించడమే కాకుండా, ఉన్నంతలో మంచి నటనని కనబరిచింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రొమాంటిక్ సాంగ్ లో కావ్య థాపర్ అందాల ప్రదర్శన కుర్రకారుకి కనువిందు చేస్తుందనే చెప్పాలి. సంతోష్ – శోభన్ – సుదర్శన్ మధ్య వచ్చే సన్నివేశాలు, వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. శ్రద్ధ దాస్ ది చెప్పుకోదగిన పాత్ర కాదు. బ్రహ్మాజీ, హర్షవర్ధన్ లు తమ పాత్రలకి న్యాయం చేస్తే సప్తగిరి పాత్ర నవ్వించలేకపోయింది.

తెర వెనుక టాలెంట్..

సింపుల్ బడ్జెట్ లో సినిమాని విజువల్ గా చాలా బాగా చేశారు. సినిమాటోగ్రాఫర్ గోకుల్ భారతి ప్రతి ఫ్రేమ్ ని బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకున్నారు. దానికి తగ్గట్టే ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ కూడా ఉంది. వీరిద్దరి వర్క్ వలన సినిమా చూస్తున్నప్పుడు ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. రవీందర్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సత్య జి ఎడిటింగ్ ఓకే, కానీ స్టోరీ పాయింట్ చాలా చిన్నది అవ్వడం వలన, షార్ట్ గా కాకుండా 2 గంటల 14 నిమిషాల సినిమా కావడంతో బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది.

మేర్లపాక గాంధీ ఎంచుకున్న స్టోరీ పాయింట్ చాలా చిన్నది. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పకుండా అనవసరమైన ట్రాక్స్ తో సాగదీయడం వలన కథ పరంగా సెకండాఫ్ చాలా బోర్ కొడుతోంది. మొదటి అర్ధభాగం 45 నిమిషాల వరకూ ఓకే ఇక అక్కడి నుంచీ ఏదో సాగదీస్తున్నట్టే ఉంటుంది. అదీకాక సెకండాఫ్ లో వేసుకున్న కామెడీ ట్రాక్స్ వర్కౌట్ కాకపోవడం వలన బోర్ కొట్టేస్తుంది. సీరియస్ గా తీసుకెళ్లాల్సిన చోట కూడా కామెడీ చేసేయడంతో ఎమోషనల్ ఫీల్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అలాగే స్క్రీన్ ప్లే మరో బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పచ్చు. కామెడీ అనుకుంటూ వెళ్లిపోయారు తప్ప కథ ఆసక్తికరంగా వెళ్తోందా అన్న విషయాన్ని మిస్ అయ్యారు. మేర్లపాక గాంధీ రాసిన వన్ లైవ్ డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ రాపోలు నటన రాబట్టుకోవడంలో, కామెడీ సీన్స్ ని కొంతవరకూ డీల్ చేయగలిగాడు కానీ ఓవరాల్ మూవీతో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. యువి కాన్సెప్ట్స్ అండ్ మాంగో మాస్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– సంతోష్ శోభన్ పెర్ఫార్మన్స్
– సంతోష్ శోభన్ – సుదర్శన్ కామెడీ ట్రాక్
– మొదటి 45 నిమిషాలు
– స్టోరీ లైన్ మరియు మెసేజ్

బోరింగ్ మోమెంట్స్:

– పాయింట్ బాగున్నా బోర్ కొట్టించే పూర్తి కథ
– ఆసక్తిగా సాగని కథనం
– బోరింగ్ సెకండాఫ్
– అంతగా వర్కౌట్ కాని సిల్లీ కామెడీ
– వీక్ క్లైమాక్స్
– బాబోయ్ అనిపించే మూవీ లెంగ్త్

విశ్లేషణ:

‘ఏక్ మినీ కథ’ టైటిల్ అయితే, ‘డస్ సైజ్ మాటర్?’ అనేది టాగ్ లైన్.. అక్కడే తెలుస్తుంది ఇదొక చిన్నపాటి అడల్ట్ కామెడీ మూవీ అని.. అన్నట్టే ఆ అడల్ట్ పాయింట్ తో మొదలెట్టి దానికి కూసింత కామెడీ టచ్ ఇచ్చి సరదాగా యువత అంతా కనెక్ట్ అయ్యేలా సినిమాని ప్రారంభించడంలో టీం సక్సెస్ అయ్యారు. ఆ తర్వాతే చెప్పిన పాయింట్ నే తిప్పి తిప్పి చెప్పడమే కాకుండా మరీ పాత చితకాయపచ్చడి కామెడీతో, చిత్ర విచిత్రమైన పాత్రలతో కథని ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. దాంతో చూసే ఆడియన్స్ కి బోరింగ్ తో పాటు చివరికి ఇక ముగించేయండి బాబోయ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా ‘ఏక్ మినీ కథ’ మొదట్లో ఆకట్టుకొని చివరికి నీరుగార్చేసే లెంగ్తీ కథ.

చూడాలా? వద్దా?: ఓపికతో పాటు ఖాళీగా ఉంటే యువత మాత్రం ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2/5 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...