Switch to English

ఔను, కరోనా వైరస్ కంటే ఎన్నికలే ముఖ్యం.! ఇదే నిష్టుర సత్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాల్ని తోడేస్తోన్న వేళ, దేశంలో నిస్సిగ్గుగా ఎన్నికల వ్యవహారం నడిచింది.. పలు రాష్ట్రాల్లో. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. రాజకీయ పార్టీలెలాగూ బాధ్యతారాహిత్యంతోనే వ్యవహరిస్తాయనుకోండి.. అది వేరే సంగతి.

డబ్బు పంచారు.. మద్యం పంచారు, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడం అనే వాటిని పూర్తిగా మరిచిపోయారు.. చెప్పుకుంటూ పోతే చాలానే జరిగింది. అదే ఆ నిర్లక్ష్యమే ఈ రోజు దేశాన్ని అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేసింది. మద్రాస్ హైకోర్టు, ఎన్నికల సంఘం మీద హత్య కేసు బనాయించాలంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మరోపక్క, ఓ మహిళ ఎన్నికల కారణంగా తన భర్తను కోల్పోయానంటూ కోర్టు మెట్లెక్కింది.. ఆ మహిళ, ఓ రాజకీయ ప్రముఖుడి భార్య. ఆ రాజకీయ ప్రముఖుడు బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసి, ఫలితాలు రాకముందే ప్రాణాలు కోల్పోయాడు.

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఎంతమంది ప్రాణాలు తీసిందో లెక్కేయడం కష్టం. అక్కడ ఇప్పుడు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సంగతి సరే సరి. ఏపీలో స్థానిక ఎన్నికలపై రేగిన దుమారం అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పుడిక తెలంగాణలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ, మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్నికల అధికారులు భూమ్మీదే వున్నారా.? ఆకాశంలో వున్నారా.? అని నిలదీసింది.

పాపం అధికారులు ఏం చేస్తారు.? వారిని నడిపిస్తున్న ప్రభుత్వాలదే అసలు తప్పు అంతా.. ఎన్నికల నిర్వహణ అన్నది ఓ ప్రసహనంగా మారిపోయింది ఇటీవలి కాలంలో. ఎవరు అధికారంలో వుంటే, వారి కనుసన్నల్లోనే అన్నీ జరుగుతున్నాయి. అధికారుల్ని నిందించి ప్రయోజనమేంటి.? ప్రభుత్వాలపై చర్యలుండాలి.. ఆ ప్రభుత్వాల్ని నడిపే రాజకీయ నాయకుల మీద మోపాలి హత్య కేసులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో కరోనా బారిన పడినా, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల వైపు మొగ్గు చూపడం వ్యవస్థల దిగజారుడుతనానికి నిదర్శనం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...