Switch to English

జుత్తాడ నరమేధం..! అప్పలరాజులో కసి చూసి బిత్తరపోతున్న పోలీసులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

విశాఖలో నరమేధం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఒకే కుంటుబానికి చెందిన ఆరుగురిని అత్యంత క్రూరంగా హతమార్చాడు నిందితుడు అప్పలరాజు. రెండేళ్ల బాలుడు, ఆరు నెలల పసిపాప.. అనే కనికరం చూపకుండా ప్రతీకారేచ్ఛతో మారణహోమం సృష్టించాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ సంబంధమే ఈ హత్యలకు కారణమని తొలుత భావించినా.. ఆస్తి గొడవలు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉందని బాధితుడు విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

అయితే.. ఇంత జరిగాక కూడా అప్పలరాజు పోలీసలకు కోటి రూపాయాలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆరుగురిని హత్య చేసినా అప్పలరాజులో కసి తగ్గలేదని పోలీసులు చెప్తున్నారు. తాను హత్య చేయాల్సిన విజయ్ బతికే ఉన్నాడని.. తనను గంట వదిలేస్తే విజయ్ ను హత్య చేసి వచ్చి లొంగిపోతానని చెప్పడం.. పైగా.. ఇందుకు కోటి రూపాయల ఆఫర్ ఇవ్వడం పోలీసులకు షాకిస్తోంది. దీంతో అప్పలరాజును మరింత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచి.. ఇందుకు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

విజయ్‌కిరణ్‌ విజయవాడ నుంచి జుత్తాడ వచ్చాడని భావించి కత్తి తీసుకొని వారింటికి వెళ్లినట్టు తెలుస్తోంది. తన కుమార్తెకు పెళ్లి కాకపోవడానికి విజయ్ కారణమని భావించి మొత్తం కుటుంబాన్నే హతమార్చినట్టు పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. హత్య చేసేందుకు వెళ్లినప్పుడు విజయ్ లేకపోవడం.. అతడి భార్య వెటకారపు నవ్వు.. తనలో కసి పెంచిందని నిందితుడు చెప్తున్నాడు. సాయంత్రానికి విజయ్ వచ్చాడని తెలుసుకున్న అప్పలరాజు కోటి ఆఫర్ ఇవ్వడం.. విజయ్ ను చంపి లొంగిపోతానని చెప్పడం.. అతడి మానసిక పరిస్థితి సరిగాలేదని భావిస్తున్నారు పోలీసులు.

 

అయితే.. అప్పలరాజు మంచి వ్యక్తి అని.. సాయం కోరి వస్తే ఆదుకుంటాడని స్థానికులు చెప్తున్నారు. అయితే.. అప్పలరాజు కుమార్తెను విజయ్‌కిరణ్‌ మభ్యపెట్టి లొంగదీసుకున్నాడని.. ఆమె ద్వారా అతడి కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందాలని భావించడంతో అప్పలరాజు అనుమానం పెంచుకున్నడాని.. అందుకే తరచూ గొడవలు జరిగేవని కూడా చెప్తున్నారు.

 

మూడేళ్ల క్రితం ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలుస్తోంది. ఫిర్యాదులో.. తన కుమార్తెకు వస్తున్న పెళ్లి సంబంధాలను వారే చెడగొడుతున్నారని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో విజయ్ కిరణ్ భార్య కూడా ఎదురు కేసు వేయడంతో సమస్య కోర్టు వరకూ వెళ్లింది. దీంతో తప్పుచేసి వారు బాగున్నారని.. అడపిల్ల తండ్రిగా తాను మానసిక క్షోభ అనుభవిస్తూ బాధ పడేవాడని స్థానికులు అంటున్నారు. ఇదే.. అప్పలరాజు వారిపై కక్ష పెంచుకోవడానికి కారణమైందని అంటున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...