Switch to English

సినిమా రివ్యూ : సీత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మన్నార చోప్రా, సోను సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ..
దర్శకత్వం : తేజ
నిర్మాత : అనిల్ సుంకర
సంగీతం : అనూప్ రూబెన్స్
కెమెరా : శిరీషా రే
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా రెండో ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం సీత. సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కింది. విడుదలకు ముందునుండి భారీ అంచనాలు పెంచుకున్న సీత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీత ఎవరు ? ఆమె కథ ఏమిటో తెలుసుకుందామా ?

కథ :

సీత ( కాజల్ ) మానవసంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి  ఉంటాయి తప్ప ఇక్కడ మనుషులకు విలువ లేదని నమ్మే అమ్మాయి. అందుకే డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న పక్కా ఓ స్వార్థపరురాలు అని చెప్పాలి. తన స్వలాభం కోసం ఎవరి జీవితంతోనైనా ఆడుకుంటుంది. అలాంటి సీత ఓ ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో భాగంగా లోకల్ ఎంఎల్ఏ అయిన బస్వ రాజు ( సోను సూద్ )తో ఓ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ అగ్రిమెంట్ వల్ల చిక్కుల్లో పడుతుంది సీత. దాన్నుంచి బయట పడడానికి డబ్బులు అవసరం అవుతాయి. అలాంటి సీత అమాయకుడైన తన బావ రామ్ ( శ్రీనివాస్) ని పెళ్లి చేసుకుంటుంది. రామ్ చిన్నప్పటినుండి సమాజానికి దూరంగా ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు తెలియని సమాజంలో చదువుకుంటూ పెరుగుతాడు. అదే బౌద్ధారామం. ఈ పెళ్లి జరగాలంటే రామ్ దగ్గరున్న డబ్బును తన ఖాతాలోకి మార్చుకుంటుంది సీత. రామ్ పేరుమీదున్న ఆస్తిపైనే సీత ఆసక్తి తప్ప రామ్ అంటే అంత ఆసక్తి ఉండదు. సీత ను వెంబడిస్తున్న బస్వరాజ్ నుండి రామ్ ఎలా సీతను కాపాడాడు ? రామ్ మనసును సీత అర్థం చేసుకుందా ? అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

సీత .. కథ మొత్తం తన భుజం పై వేసుకుని నడిపించింది కాజల్. ఎవరిననీ లెక్కచేయనితనం, ఓటమిని అంగీకరించని ప్రామిసింగ్  విమెన్ గా మంచి ఆటిట్యూడ్ చూపించింది కాజల్. ఓ వైపు మంచి అమ్మాయిగా, మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రెండు షేడ్స్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈ పాత్రను బట్టి చూస్తే కాజల్ నెక్స్ట్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇక అమాయకుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ నటన ఆకట్టుకుంది. అల్లుడు శీను తరహాలో మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇక సోనూసూద్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎం ఎల్ ఏ  బస్వరాజు గా సూపర్ అనిపించాడు. ఆయనకు సపోర్టింగ్ రోల్ లో తనికెళ్ళ భరణి ల కాంబినేషన్ అదిరింది. ఇక బిత్తిరిసత్తి కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విషయంలో కాజల్, సోనూసూద్ ల మధ్య నువ్వా నేనా అనే తరహాలో పోటీ నిలిచింది.

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమా విషయంలో సీనియర్ దర్శకుడు తేజ గురించే చెప్పాలి. కథ, కథనం విషయంలో తేజ ఆకట్టుకునే స్థాయిలో కథను నడిపించలేదు. కాజల్ పాత్ర పై పెట్టిన దృష్టి కథనం పై పెట్టలేదు. ఇక అనూప్ అందించిన సంగీతం ఫరవాలేదు. బుల్ రెడ్డి సాంగ్ బాగానే ఆకట్టుకుంది. రీ రీకార్డింగ్ జస్ట్ ఓకే. ఇక కెమెరా పనితనం బాగుంది. చాలా  అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. తేజ సినిమాలో కథ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది, కానీ ఈ సినిమా విషయంలో అలాంటి అనుభూతి కథలో కలగదు. ఎక్కడా ఆకట్టుకోని కథ. కాజల్ లాంటి పాత్రలను మనం ఇదివరకే చాలా చూసేసాం .. అలాంటి పాత్రను మెయిన్ లీడ్ గా తీసుకుని కథ అల్లుకున్నాడు తేజ. కథనం ఏమాత్రం పెద్దగా ఆసక్తిలేని మలుపులతో సాగుతూ బోర్ కొడుతుంది.

విశ్లేషణ :

సీత అంటూ విమెన్ సెంట్రిక్ కథను తీసుకుని కాజల్ మెయిన్ లీడ్ గా పెట్టి దర్శకుడు తేజ చేసిన ఈ ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోదు. కథలో ఎక్కడా మలుపులు కానీ, ట్విస్ట్ గాని లేవు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించగలడు. ఇక హీరోగా నిలదొక్కునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ని ఈ పాత్రలో ఊహించుకోవడం కష్టం. కొంచెం కామెడీ ఉన్నప్పటికీ హీరో పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేకపోవడం బోర్ కొడుతుంది. ఇక కథలో చాలా లాజిక్స్ మిస్సయ్యాయి. ఒక్క సాంగ్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. తేజ నుండి ఇలాంటి సినిమాలు ఎవ్వ రూ ఊహించరు. మొత్తానికి సీత అంటూ తేజ చేసిన ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.

ట్యాగ్ లైన్ : బోర్ కొట్టించింది

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...