Switch to English

జనసేనను వదిలించుకునే యత్నంలో బీజేపీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మిత్రధర్మం అనేది బీజేపీకి బొత్తిగా తెలియదు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమయిపోయింది. అప్పట్లోనే జనసేన, మిత్రపక్షమైన బీజేపీ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయినాగానీ, పొత్తు ధర్మానికి కట్టుబడి.. తమ అభ్యర్థుల్ని బరిలోంచి ఉపసంహరించుకుంది జనసేన. అదే సమయంలో, బీజేపీకి పూర్తిగా మద్దతిచ్చారు జనసైనికులు. గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేన ఎంతలా తమకు సాయపడిందీ ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. కానీ, తిరుపతి ఉప ఎన్నిక విషయానికొచ్చేసరికి మళ్ళీ బీజేపీ పాత నాటకమే ఆడుతోంది.

ఇప్పటికే, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడ్తామని పలువురు బీజేపీ నేతలు ప్రకటించగా, ‘ఉమ్మడి అభ్యర్థి విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం..’ అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ హుందాగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఇటీవల ఇరు పార్టీల నేతలూ భేటీ అయ్యారు. అందరం కలిసి ఉమ్మడి అభ్యర్థిపై నిర్ణయం తీసుకుందామని కూడా అనుకున్నారు. కానీ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాత్రం, తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది బీజేపీ అభ్యర్థి మాత్రమేననీ, జనసేన ఆ అభ్యర్థికి సహకరిస్తుందనీ సెలవిచ్చారు.

ఇది చదవండి: తిరుపతి అభ్యర్థిపై జనసేనాని ఆలోచన ఇదేనా.?

ఇలాంటి ప్రకటనలు ఇరు పార్టీలకు చెందిన నేతలూ ఒకే వేదికపై చేయాల్సి వుంటుంది. పైగా, అభ్యర్థి ఎవరన్నదానిపై ఇంకా జనసేన ఓ నిర్ణయం తీసుకోకముందే, ఇరు పార్టీల సమక్షంలో నిర్ణయం జరగకముందే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ‘మా అభ్యర్థి మాత్రమే బరిలో వుంటారు’ అని చెప్పడమేంటి.? పొమ్మనలేక పొగపెడుతున్న వ్యవహారంలా తయారైందిది. జనసేన పార్టీ ఇప్పటికైనా ఈ విషయమై అప్రమత్తమవ్వాల్సి వుంది. పొత్తు ధర్మం సరే, రాజకీయ ధర్మం విస్మరిస్తే ఎలా.?

పార్టీని నమ్ముకుని జనసైనికులు ఏడేళ్ళుగా కష్టపడుతున్నారు. వారి కష్టానికి తగిన గుర్తింపు లభించకపోయినా ఫర్లేదు, అవమానాలు ఎదురైతే ఎలా.? ‘బీజేపీ మిమ్మల్ని లెక్కచేయకపోయినా, మీరు బీజేపీతో అంటకాగుతున్నారు..’ అనే దెప్పిపొడుపుల్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ, అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీద గౌరవంతో.. అన్ని అవమానాల్నీ దిగమింగుకోక తప్పడంలేదు జనసైనికులకి. అభ్యర్థి ఎవరు.? అన్నదానిపై బీజేపీలో కూడా ఇంతవరకు ఓ అవగాహన లేని పరిస్థితి.

ఫలానా అభ్యర్థి.. అని ప్రకటించకుండా, ‘మేమే పోటీ చేస్తాం.. జనసేన మద్దతిస్తుంది..’ అని చెప్పుకోవడమేంటి.? దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీకి పెరిగిన క్రేజ్‌తో అది ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ రిపీట్‌ అవుతుందనే అత్యుత్సాహంతో కన్పిస్తోన్న బీజేపీకి, ఏపీలో అంత సీన్‌ లేదన్నది మాత్రం గ్రౌండ్‌ రియాల్టీ.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...