Switch to English

తిరుపతి అభ్యర్థిపై జనసేనాని ఆలోచన ఇదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో బీజేపీ – జనసేన మధ్య చర్చలు జరిగాయి. జనసేన అధినేత ఢిల్లీలో వుండగానే, ‘తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుంది..’ అంటూ బీజేపీ నేతలు కొందరు సెలవిచ్చారు. అయితే, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాత్రం, ఢిల్లీ పెద్దల నుంచి ఈ విషయమై పూర్తి స్పష్టత తీసుకున్నట్లే కనిపిస్తోంది. ‘ఎవరు పోటీ చేయాలన్నదానిపై జాయింట్‌ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయానికి సంబంధించి ఇరు పార్టీల మధ్యా చర్చలు జరుగుతాయి. అంతిమంగా నిర్ణయం ఢిల్లీ స్థాయిలోనే జరుగుతుంది..’ అని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టతనిచ్చారు.

‘మేం, పోటీలోంచి తప్పుకోవడం అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎవరు బరిలో నిలిచినా, ఇంకొకరు సహకరిస్తారు. మేమే పోటీ చేయాలని ఎవరు అనుకున్నా, ఈ దశలో అది కరెక్ట్‌ కాదు. మా పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు సిద్ధంగా వున్నారు. వారిలోంచి ఒకర్ని దించాలా.? లేదంటే, బీజేపీ నుంచి ఎవరైనా బరిలోకి దిగుతారా.? అన్నది ముందు ముందు తెలుస్తుంది.. ఇక్కడ గెలవడం ముఖ్యం. బీజేపీ బలం ఎంత.? జనసేన బలం ఎంత.? అన్నది ఇరు పార్టీలూ బేరీజు వేసుకోవాలి..’ అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు.

పవన్‌ కళ్యాణ్‌ తాజా వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల్లో గందరగోళం షురూ అవుతుందన్నది నిర్వివాదాంశం. కాగా, రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తిరుపతి వేదికగా జగన్‌ సర్కార్‌ని నిలదీశారు. ‘ఇసుక, మద్యం వంటి విషయాల్లో ప్రభుత్వానికి సంపాదన వస్తోంది గనుక.. వాటిపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారనీ, రైతుల ఆవేదనను మాత్రం పట్టించుకోవడంలేదనీ’ పవన్‌ కళ్యాణ్‌ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు కదా.? అని ప్రశ్నిస్తే, ‘ఎక్కడో సమాచార లోపం వుంది. రైతుల మేలు కోరి కేంద్రం, కొత్త చట్టాల్ని తీసుకొచ్చింది. సమస్యలేవైనా వుంటే చర్చలతో అది పరిష్కారమవుతుందని భావిస్తున్నాను..’ అంటూ కేంద్రానికి మద్దతుగా మాట్లాడారు జనసేనాని.

‘రజనీకాంత్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. ఆయన రాజకీయల్లో విజయవంతమవ్వాలని ఆశిస్తున్నాను..’ అంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు పవన్‌ కళ్యాణ్‌. కాగా, చిరంజీవి లాంటి బలమైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, మనమే ఆయన్ని నిలబెట్టుకోలేకపోయాం. ఆయన రాజకీయాల్లో వుండి వుంటే.. ఈ రోజు ఆంధ్రపదేశ్ బలమైన ముఖ్యమంత్రిని కలిగి వుండేదని జనసేనాని వ్యాఖ్యానించడం.. అదీ తిరుపతిలో ఈ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...