Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: కలర్ ఫోటో – అంత కలర్ఫుల్ గా లేదు.!

Critic Rating
( 2.50 )
User Rating
( 1.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow
Movie కలర్ ఫోటో
Star Cast సుహాస్, చాందిని చౌదరి..
Director సందీప్ రాజ్
Producer సాయి రాజేష్, బెన్ని
Music కాలభైరవ
Run Time 2 గంటల 20 నిముషాలు
Release అక్టోబర్ 23, 2020

యూట్యూబ్ ద్వారా రైటర్ అండ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సందీప్ రాజ్ సిల్వర్ స్క్రీన్ పై మొదటి సారి దర్శకుడిగా చేసిన సినిమా ‘కలర్ ఫోటో’. కమెడియన్ సుహాస్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా, సునీల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా వీడియో ద్వారా సాయంత్రం 6 గంటలకి ప్రేక్షకుల ముందుకు రానుంది. మేము ముందే స్పెషల్ షో చూసాం. మరి కలర్ ఫోటో ఎంత కలర్ఫుల్ గా ఉందొ చూద్దాం..

కథ:
మచిలీపట్నం దగ్గర్లోని ఓ గ్రామంలో 1997లో జరిగే కథ ఇది.. జయకృష్ణ (సుహాస్) మరియు దీప్తి వర్మ(చాందిని చౌదరి) ఒకే కాలేజీలో చదువుతుంటారు. కలర్ విషయంలో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ మొదటి చూపులోనే దీప్తిని కృష్ణ ఇష్టపడతాడు, కానీ తన ప్రేమ గురించి చెప్పడానికి ధైర్యం సరిపోదు. కృష్ణ అదృష్టం కొద్దీ దీప్తి కూడా కృష్ణ అంటే ఇష్టం ఉండడంతో తనే వచ్చి కృష్ణకి తన ప్రేమ గురించి చెప్పడంతో, కృష్ణ ఆనందానికి హద్దులుండవు. ఒకరినొకరు స్వచ్చంగా ప్రేమించుకుంటారు. అదే సమయంలో దీప్తి అన్నయ్య, పోలీస్ ఆఫీసర్ అయిన రామరాజు (సునీల్) కి విషయం తెలియడంతో దీప్తి కాలేజీ మాన్పించేసి విజయవాడ కి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను ప్రేమించిన దీప్తిని దక్కించుకోవడం కోసం కృష్ణ ఏం చేసాడు? ఎలా రామరాజుని ఎదిరించాడు? చివరి కృష్ణ – దీప్తిలు ఒకటయ్యారు? లేదా? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

తెరపై కనిపించిన అందరూ అద్భుతమైన నటనని కనబరిచారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కమెడియన్ గా ఇప్పటి వరకూ మనల్ని మెప్పించిన సుహాస్ ఈ సినిమాలో తన కామెడీతో ఎంత ఆకట్టుకుంటాడో, అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేసాడు. ఇక చాందిని చౌదరి మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. చెప్పాలంటే ఇంత క్యూట్ గా మరే సినిమాలోనూ కనిపించలేదని చెప్పాలి. సునీల్ ఇప్పటికే ఇప్పటికే ఒకటి రెండు సీన్స్ లో నెగటివ్ షేడ్స్ చేసాడు. కానీ ఇందులో పూర్తిగా విలన్ పాత్రలో బాగా చేసాడు అనిపిస్తుంది. తను కామెడీనే కాదు స్ట్రాంగ్ విలనిజం పాత్రలు కూడా చేయగలడని ఈ సినిమా చెబుతుంది. కమెడియన్ హర్ష ఫన్ మొదటి అర్ధ భాగంలో బాగానే వర్కౌట్ అయ్యింది. మొదటి 40 నిమిషాల్లో సుహాస్ – హర్ష మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా నవ్వు తెప్పిస్తాయి. కృష్ణ తండ్రిగా చేసిన సుబ్బారావు, బిగ్ బాస్ ఆదర్శ్ మంచి క్యారెక్టర్ లో కనిపించి మెప్పించారు.

తెర వెనుక టాలెంట్..

నటీనటుల్లానే సాంకేతిక నిపుణుల పనితీరు కూడా ఈ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. వెంకట్ ఆర్ శాఖమూరి అందించిన విజువల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయని చెప్పాలి. ఆ సూపర్బ్ విజువల్స్ కి కాల భైరవ నేపధ్య సంగీతం మరింత ప్లస్ అయ్యింది. ప్రతి సన్నివేశంలో మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది మాత్రం విజువల్స్ అండ్ మ్యూజిక్ అని చెప్పాలి. కాల భైరవ నేపధ్య సంగీతమే కాదు పాటలు కూడా చాలా బాగా ఇచ్చాడు. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ స్పీడ్ గా బాగుంటుంది. కానీ సెకండాఫ్ లోనే బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది.

ఇక మెయిన్ టాపిక్ కథ విషయానికి వస్తే.. సాయి రాజేష్ తీసుకున్న కథ మన అందరికీ తెలిసిందే, ఇప్పటికి చాలా సార్లు చూసేసిందే.. కానీ కథని ప్రస్తుతంలో చెప్పకుండా 1997 బ్యాక్ డ్రాప్ లో చెప్పడం, డబ్బు, కులం, మతం కాదునా కలర్(వర్ణ వివక్ష) నేపథ్యంలో కథని చెప్పడం కాస్త బెటర్ గా అనిపిస్తుంది. ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ సందీప్ రాజ్ విషయానికి వస్తే, రెగ్యులర్ కథని తన రచనతో మొదలు పెట్టిన విధానం చాలా బాగుంది. మొదటి 40 నిమిషాలు కామెడీతో నెట్టుకొచ్చేసాడు. ఆ తర్వాత ఇక కథ ఎప్పుడు మొదలవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఇక ఇంటర్వెల్ దగ్గర కథ మొదలవుతుంది. సెకండాఫ్ లోకాసేపటికే మళ్ళీ రొటీన్ ట్రాక్ లో పడి మనం ఊహించవే జరుగుతుండడం మరియు మరీ బ్యాడ్ క్లైమాక్స్ వలన డిజప్పాయింట్ అవుతాం. ఇక డైరెక్టర్ గా అటు నటీనటులను, ఇటు టెక్నికల్ క్రాఫ్ట్స్ ని చాలా బాగా డీల్ చేసాడు. కానీ ఆధ్యంతం ఆకట్టుకునే సినిమాని తీయడంలో, ప్రేమకథకు కీలకమైన ఎమోషనల్ సీన్స్ ని తీయడంలో తడబడ్డాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది. డైరెక్టర్ గా సగమే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సాయి రాజేష్, బెన్ని నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– సుహాస్, చాందినిల పెర్ఫార్మన్స్
– స్టార్ ఇమేజ్ ఉన్న సునీల్ సపోర్ట్
– సూపర్బ్ అనిపించే మ్యూజిక్ అండ్ విజువల్స్
– నవ్వించే మొదటి 40 నిమిషాలు

బోరింగ్ మోమెంట్స్:

– 40 నిమిషాల తర్వాత స్లో అవ్వడం
– ఇంకా బెటర్ గా ఉండాల్సిన లవ్ ట్రాక్
– ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకపోవడం
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమా అంత కలర్ఫుల్ గానూ లేదు, అలా అని పేలవంగానూ లేదు. మధ్యస్తంగా కాసేపు నవ్వులు కాసేపు బోరింగ్, కాసేపు లవ్ ట్రాక్ మళ్ళీ కాసేపు బోరింగ్ అంటూ సాగుతుంది. తెలిసిన కథే అవ్వడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయితే నటీనటుల నటన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఓవరాల్ గా ఈ రొటీన్ ‘కలర్ ఫొటో’లో బోరింగ్ మోమెంట్స్ ఉన్నప్పటికీ, అక్కడక్కడా కొన్ని కొన్ని మెరుపులు బాగానే ఉండడంతో లవ్ స్టోరీస్ ఇష్టపడే వారు చూడచ్చు..

చూడాలా? వద్దా?: జస్ట్ ఫర్ లవ్ స్టోరీ ఫ్యాన్స్.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.5/5 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...