Switch to English

కార్మికోద్యమ నేత.. నాయిని కన్నుమూత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,408FansLike
57,764FollowersFollow

తెలంగాణ మాజీ హోంమంత్రి, కార్మికోద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన.. అందుకు చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే, అనంతరం లంగ్స్ ఇన్ఫెక్షన్ కి గురికావడతో న్యుమోనియా సోకింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లి నాయిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత నాయిని పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆయన్ను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

నాయినికి భార్య అహల్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి రాంనగర్ డివిజన్ కార్పొరేటర్. సోషలిస్టు పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాయిని.. పేదలకు అండగా నిలిచేవారు. ముఖ్యంగా కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటం చేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి భరోసా కల్పించేవారు. హైదరాబాద్ వీఎస్టీలో తిరుగులేని ముద్ర వేశారు. అనంతరం ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. ఉద్యమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. వైఎస్ హయాంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నాయిని.. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై కేసీఆర్ కేబినెట్ లో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అయితే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన కొద్దిరోజులు అలకబూనారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ను తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి ఇప్పించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. కేసీఆర్ సుముఖత వ్యక్తంచేయలేదు. దీంతో కొద్దిగా అలకబూనినా.. తర్వాత సర్దుకున్నారు. కాగా, నాయిని మరణం పట్ల కార్మిక సంఘాలు, టీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: సినీ జర్నలిస్టులపై చిరంజీవికి ప్రత్యేక గౌరవం.. ఇవే ఉదాహరణలు

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi)కి సినిమా అంటే ఇష్టం. అభిమానులంటే ఇష్టం. సినిమా వ్యక్తులంటే ఇష్టం. అలాగే సినీ పాత్రికేయులంటే మరీ ఇష్టం. కారణం.. ఆయన తెలుగు...

Hema: హేమ తప్పు అంగీకరించినట్టేనా..!? వైరల్ అవుతున్న ఆమె కామెంట్స్

Hema: బెంగళూరు రేవ్ పార్టీపై ఇన్నాళ్లూ బుకాయించిన నటి హేమ (Hema) ఇప్పుడు తన తప్పును అంగీకరించారా..? పార్టీలో పాల్గొన్నానని చెప్పకనే చెప్పారా..? ఆమె విడుదల...

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

రాజకీయం

విశాఖ హోటళ్ళలో రేట్లు పెంచేశారా.? వైసీపీ కోసమేనా.?

విన్నారా.? ఇది విన్నారా.? విశాఖలో హోటల్ రూమ్ దొరకడం గగనమైపోతోందిట.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోందనీ, విశాఖలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారనీ.. వైసీపీ ప్రచారం...

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

ఎక్కువ చదివినవి

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న న్యూస్

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని సమాచారం. తెలుగు, తమిళ సినిమాల లెజండరీస్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై నవదీప్

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను నటించిన లవ్ మౌళి (Love Mouli)...

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే.! దొంగలు పడ్డ ఆర్నెళ్ళకి.!

‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో ఓ సినిమా వచ్చింది కొన్నాళ్ళ క్రితం. నితిన్ హీరో.! సినిమా కదా, కాసిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయ్. కానీ, మాచర్ల నియోజకవర్గంలో జరిగే రాజకీయ హింస మాత్రం నిజం....

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

Hema: హేమ తప్పు అంగీకరించినట్టేనా..!? వైరల్ అవుతున్న ఆమె కామెంట్స్

Hema: బెంగళూరు రేవ్ పార్టీపై ఇన్నాళ్లూ బుకాయించిన నటి హేమ (Hema) ఇప్పుడు తన తప్పును అంగీకరించారా..? పార్టీలో పాల్గొన్నానని చెప్పకనే చెప్పారా..? ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాటలు ఇవే...