Switch to English

కేసీఆర్‌ వర్సెస్‌ జగన్‌: ఈ ‘జలయుద్ధం’లో ‘చిత్తశుద్ధి’ ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..’ అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం..’ అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్. కానీ, ‘నీటి సమస్యల పరిష్కారం’ కోసమంటూ కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌.. ఒకర్నొకరు కౌగలించుకున్నారు.. ఈ స్నేహం ఎప్పటికీ చెరిగిపోనిది.. అంటూ పండగ చేసుకున్నారు. ‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణతో గొడవలు పెట్టుకున్నారు.. మేం మాత్రం, తెలంగాణతో సఖ్యతగా వుంటూ.. రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాం..’ అని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. ఆ సఖ్యత ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అందరికీ.

రాయలసీమ నీటి సమస్యల్ని తీర్చే ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుడితే, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాంతో, కేసీఆర్‌కి ఒళ్ళు మండింది.! నిజంగానే మండిందా.? మండినట్లు నటిస్తున్నారా.? ఏమోగానీ, విషయం ముదిరి పాకాన పడినట్లు కన్పిస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్‌తో గొడవల్ని మేం కోరుకోలేదు. ఇరు రాష్ట్రాలూ కలిసి సంయుక్తంగా నీటి ప్రాజెక్టులు కట్టుకుని.. గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఒడిసిపట్టి, వాడుకుందామనుకున్నాం.. వైఎస్‌ జగన్‌ని ఇంటికి పిలిచి, భోజనం పెట్టి మరీ.. విషయాన్ని వివరించాను.. కానీ, ఇప్పుడిలా ఆంధ్రప్రదేశ్‌ అన్ని విషయాల్లోనూ మాకు అడ్డు తగులుతుందని అనుకోలేదు..’ అంటూ కేసీఆర్‌ గుస్సా అయ్యారు.

శ్రీశౖలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి వాడకంపై రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగింది. నిజానికి, ఇది కొత్త తగాదా కాదు.. పాతదే. కాస్త కొత్తగా హైలైట్‌ అవుతోంది. కరోనా విషయంలో అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌.. నానా రకాల విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ.. వివిధ అంశాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. దాన్నుంచి తప్పించుకోవడానికే, ఈ ‘జల యుద్ధం’ తెరపైకొచ్చినట్లు కన్పిస్తోంది. లేకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అభ్యంతరాలున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి పిలవగానే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ ఎలా వెళ్ళగలిగారు.? పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది మొదటి నుంచీ. ఆ విషయమై సమస్య పరిష్కారమయ్యిందా.? లేదా.? అన్న ప్రశ్నకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వడంలేదు.? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.

2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి వైసీపీ తెరవెనుక సహకారం అందించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి టీఆర్‌ఎస్‌ సహకరించింది. ఈ బంధం నిజంగానే చాలా బలమైనది. మరి, ఈ గిల్లికజ్జాలేంటి.? అంటారా.! అదే మరి, ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’ అంటే.! అన్నట్టు, ఏపీ నోరు మూయించేలా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమాధానం చెబుతామని అంటున్న కేసీఆర్.. మాట మీద నిలబడతారా.? తన విశ్వసనీయతను చాటుకుంటారా.? వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...