Switch to English

సిగ్గు సిగ్గు: బెజవాడ అగ్ని ప్రమాదంపై ‘కుల’ రాజకీయమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

రాజకీయమంటే సిగ్గూ ఎగ్గూ వదిలెయ్యాల్సిందేనా.! ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులైన నెటిజన్ల తీరు ఇలాగే వుంది మరి.! విజయవాడలోని ఓ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడే అసలు రాజకీయం షురూ అయ్యింది.

ఆ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తోంది. స్వర్ణ ప్యాలెస్‌ అనే స్టార్‌ హోటల్‌ని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు. అయితే, అగ్ని ప్రమాదం జరిగాక.. సదరు ఆసుపత్రి ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిదంటూ.. వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు ‘చెత్త కామెంట్లు’ పోస్ట్‌ చేస్తున్నారు సోషల్‌ మీడియాలో. ‘కమ్మ’వారికి చెందిన ఆసుపత్రి కావడంతో అనుమానాలు కలుగుతున్నాయ్‌.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఇమేజ్‌ని దెబ్బతీయడానికి ఎవరైనా కుట్ర పన్నారా.? అంటూ ట్వీట్లు వేసేస్తున్నారు వైసీపీ మద్దతుదారులు.

దానికి కౌంటర్‌ ఇస్తోన్న టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు, కరోనా వ్యాక్సిన్‌ని తయారు చేస్తోన్న భారత్‌ బయోటెక్‌ సంస్థ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాళ్ళది.. అంటూ ఇంకో అడుగు ముందుకేసి.. మరింతగా ‘కుల పైత్యాన్ని’ రగుల్చుతున్నారు. అంతేనా, రాష్ట్రంలో మెజార్టీ హాస్పిటల్స్‌ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారి నిర్వహణలో వున్నాయనీ.. ఆ విషయాన్ని మర్చిపోకూడదంటూ వైసీపీ ట్వీట్లకు టీడీపీ నుంచి కౌంటర్‌ ట్వీట్లు వచ్చి పడుతున్నాయి. నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన తయారయ్యారు ఇరు పార్టీలకు చెందిన మద్దతుదారులు.

ఓ పక్క టీడీపీ అధినేత చంద్రబాబేమో ‘నన్ను ఓ కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు.. నాకు కులాన్ని ఆపాదిస్తున్నారు..’ అని వాపోతోంటే.. ఇంకోపక్క, ‘కుల మతాలకతీతంగా అందరూ మెచ్చే పాలన చేస్తాను..’ అని వైఎస్‌ జగన్‌ చెబుతోంటే.. ఆయా పార్టీల సానుభూతిపరులు మాత్రం, కులాల పేరుతో రాజకీయాలు చేస్తుండడాన్ని ఏమనుకోవాలి.? విశాఖలో వరుస ప్రమాదాల నేపథ్యంలో టీడీపీపైనే అనుమానాలు కలుగుతున్నాయని సాక్షాత్తూ వైసీపీ నేతలే (బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న ప్రజా ప్రతినిథులు కూడా) ఆరోపిస్తున్న దరిమిలా.. ఈ బెజవాడ అగ్ని ప్రమాదంపై ఈ తరహా నిస్సిగ్గు రాజకీయాల్లో వింతేముంది.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...