Switch to English

నాని వ్యాఖ్యలు బాబు పైనేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

విజయవాడ ఎంపీ కేశినేని నాని అప్పుడప్పుడూ వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ఆయన.. అటు వైరి పక్షాలతోపాటు ఇటు స్వపక్ష నేతలపైనా విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో చేసిన కామెంట్ కలకలం రేపుతోంది.

‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటివారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. అమరావతి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల. అది సాకారం అవ్వాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి. మీడియా సమావేశాల వల్ల, పేపర్ స్టేట్ మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు‘ అని చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించిందో అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అది పార్టీ అధినేత చంద్రబాబును నేరుగా ఉద్దేశించి చేసిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేసి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను చేయాలనే పట్టుదలతో అధికార పార్టీ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అమరావతిలో నిరసనలు వ్యక్తమవుతున్నా.. వైసీపీ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధిస్తున్నామని హెచ్చరికలు జారీచేసి చివరకు చేతులెత్తేశారు. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీకి సవాల్ చేస్తున్నారు.

నిజానికి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని భావించినట్టు తొలుత వార్తలొచ్చినా.. ఆ ప్రయత్నం విరమించుకున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పలుమార్లు తమ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పుడు అదే విధంగా టీడీపీ చేసే అవకాశం ఉన్నా.. బాబు మాత్రం అందుకు సాహసించడంలేదు.

జూమ్ మీటింగుల ద్వారా సవాళ్లు, విమర్శలు చేయడం తప్ప.. సరైన కార్యాచరణకు దిగడంలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాని చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా కేశినేని నాని సొంత పార్టీ నేతలపై పలు విమర్శలు చేశారు. అయితే, చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో అప్పట్లో సద్దుమణిగింది. తాజాగా నాని మరోసారి సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశమైంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...