Switch to English

రాజకీయ వైపరీత్యం: వైఎస్‌ జగన్‌కి గుడి కట్టేస్తున్నారట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కొన్నేళ్ళ క్రితం తమిళనాడులో అప్పటి గ్లామరస్‌ హీరోయిన్‌ ఖుష్బూకి గుడి కట్టేశారు అభిమానులు. అప్పట్లో అదో పెను సంచలనం. దేశవ్యాప్తంగా ఈ విషయమై పెద్ద రచ్చే నడిచింది. ఆ తర్వాత కొందరు హీరోయిన్లకు ఇలాగే అభిమానులు గుడి కట్టేశారు. దీన్ని అభిమానం అనాలా.? వేలం వెర్రి అనాలా.? అన్నది అర్థం కాని ప్రశ్న. ఇక, బతికున్న నాయకులు తమ విగ్రహాల్ని పెట్టించుకోవడం కూడా అప్పుడప్పుడూ చూస్తుంటాం. ‘ఇదేం పైత్యం.?’ అని జనం ముక్కున వేలేసుకుంటున్నా, రాజకీయ నాయకులు, వారి అనుచరులు.. పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వుంటారనుకోండి.. అది వేరే సంగతి.

చాలా చాలా అరుదుగానే బతికున్న నాయకులు తమ విగ్రహాల్ని పెట్టించేసుకుంటుంటారు. ఇదో టైపు పబ్లిసిటీ. ఇక, పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి గుడి కట్టేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. సాక్షాత్తూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఈ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారనీ, కరోనా సంక్షోభంలోనూ ధైర్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే స్థానిక నేతలు గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు తలారి వెంకట్రావు.

సంక్షేమ పథకాలకి వైఎస్‌ జగన్‌ మాత్రమే ఆద్యుడా.? అసలు వైఎస్‌ జగన్‌కి గుడి కట్టాల్సిన అవసరమేమొచ్చింది.? జగన్ ఏమన్నా తన సొంత సొమ్ముతో సంక్షేమ పథకాల్ని చేపడ్తున్నారా.? సొంత ఖర్చులతో రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నారా.? ఇదెక్కడి పైత్యం.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ‘ఈ తరహా వ్యవహారాలు సెంటిమెంట్‌ పరంగా కూడా మంచివి కావు. ఇలాంటి వ్యవహారాలపై జగన్‌ చర్యలు తీసుకుంటే మంచిది..’ అని వైసీపీ సానుభూతిపరులే సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన నేపథ్యంలో సోనియమ్మకు గుడి కట్టేశాడో కాంగ్రెస్‌ నేత. అప్పట్లో అదో పెద్ద కామెడీగా మారిపోయింది. ఇలా రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టేవారు, గుడులు కట్టేవారు.. కాలక్రమంలో పార్టీలు మారిన దాఖలాలూ లేకపోలేదు. మరి, ఆయా నేతల మీద వారికి వున్న ‘భక్తి’లో చిత్తశుద్ధి ఎంత.? ఏమోగానీ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వెర్రితలలు వేస్తోందనడానికి ఇదో నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్తున్నారు. అన్నట్టు, ఈ ఐడియా తెలుగు తమ్ముళ్ళకి రాకపోవడమే శోచనీయం. లేకపోతే, అటు ఎన్టీఆర్‌కీ.. ఇటు చంద్రబాబుకీ.. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది వేలాది గుడుల్ని నిర్మించేసి వుండేవారే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...