Switch to English

కొత్త జిల్లాల రగడ.. మంత్రి పదవుల కోసమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల రగడ షురూ అయ్యింది. ఇద్దరు వైసీపీ నేతలు, శ్రీకాకుళం జిల్లా విభజన ఆలోచనపై పెదవి విరిచారు. ఆ ఇద్దరి ‘అసహనం’పై వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ, పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరిస్తానన్నారు. కానీ, తెరవెనుక ఏం జరిగింది.? ఏం జరుగుతోంది.? లోక్‌సభ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వున్న 13 జిల్లాల్ని 25 జిల్లాలుగా మార్చుతామని ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగానే వైఎస్‌ జగన్‌ అప్పట్లో హామీ ఇచ్చారు.

వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు గనుక.. ఇప్పుడు వైసీపీ నేతలే, జిల్లాల విభజనపై అభ్యంతరం వ్యక్తం చేయడమేంటి.? ఈ ప్రశ్న సహజంగానే శ్రీకాకుళం జిల్లాతోపాటు, ఇతర జిల్లాల్లోనూ ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాల విభజనతో కొత్తగా అభివృద్ధి జరుగుతుందనుకుంటే అది పొరపాటే. కానీ, పరిపాలనా సౌలభ్యం కొంతవరకు మెరుగుపడే అవకాశముంటుంది. అయితే, పాత జిల్లాల విభజనతో కొత్త సమస్యలు వచ్చే అవకాశాల్లేకపోలేదు. కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి పూర్తిగా దూరమైపోతాయన్న ఆవేదన వుంది. ఇదే ఆవేదన సీనియర్‌ పొలిటీషియన్స్‌ అయిన దర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలనుంచి వచ్చిందని అనుకోవాలి. కానీ, సిక్కోలు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన గాసిప్‌ ప్రచారంలో వుంది.

ఇద్దరూ మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారనీ, ఈ నేపథ్యంలోనే వారి నుంచి ‘జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం’ కన్పించిందన్నది ఆ గాసిప్స్‌ సారాంశం. ఇటు ధర్మాన కావొచ్చు, అటు తమ్మినేని కావొచ్చు.. ఈ మధ్య తమ ఉనికి కోసం రాజకీయ అంశాలపై ‘లైన్‌ దాటి’ మాట్లాడుతున్న మాట వాస్తవం. తమ్మినేని, పూర్తిగా పార్టీ లైన్‌కి కట్టుబడి మాట్లాడుతోంటే, ధర్మాన మాత్రం లైన్‌ దాటి మాట్లాడేందుకూ వెనుకాడ్డంలేదు. అగ్రెసివ్‌ నేచర్‌ ద్వారా ధర్మాన, శ్రీకాకుళం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారారు. దాంతో, తమ్మినేని కూడా జిల్లా విభజన విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి.. తానూ వార్తల్లో వ్యక్తి అయ్యారు.

ఇక, తమ్మినేని ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేస్తున్నప్పటికీ, ఆయనకు మంత్రి పదవి మీద మమకారం ఈ మధ్య పెరిగినట్లే కన్పిస్తోంది. మరి, ఈ ఇద్దరి నేతల మధ్యా ‘పదవి కోసం’ పోటీ జరుగుతోందన్న ప్రచారమే నిజమైతే, ఇద్దరిలో ఎవర్ని ఆ పదవి వరిస్తుంది.? అన్నది వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా ఇది తొలి సినిమా. ఓ...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...