Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. వీటిల్లో కొన్ని ‘పాత పథకాలకు కొత్త పేర్లు’ అయితే, ఇంకొన్ని నిజంగానే కొత్త సంక్షేమ కార్యక్రమాలు. ఆయా సంక్షేమ పథకాల అమలుకి సంబంధించి మళ్ళీ చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘అధికార పార్టీ కోటా’ కారణంగా అసలైన లబ్దిదారులు నష్టపోతున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. ‘అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి. మనకి ఓటెయ్యనివారికీ సంక్షేమ పథకాలు అందాలి..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నా, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి ఆరేళ్ళయ్యింది.. ఇంకా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయమై గందరగోళం అలానే వుంది. ‘కరోనా టెస్టుల్లో మా రాష్ట్రం దూసుకుపోతోంది.. సంక్షేమ పథకాల విషయంలోనూ రాష్ట్రానిదే టాప్‌ ప్లేస్‌..’ అని ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారెవరైనా ఇతర రాష్ట్రాల్లో మాట్లాడితే, ‘మీ రాష్ట్రానికి రాజధాని వుందా.? వుంటే, దాని పేరేంటి.?’ అని ప్రశ్నిస్తున్నారు. అంతే, ఆ ప్రశ్న వినేసరికి.. దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం విదితమే. ‘అబ్బే, చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినా.. అది అధికారికంగా రికార్డుల్లోకి ఎక్కలేదు..’ అని వైసీపీకి చెందిన పలువురు నేతలు, పైగా ప్రస్తుతం మంత్రి పదవుల్లో వున్నవారే చెబుతుండడంతో.. రాష్ట్రానికి రాజధాని వుందా.? లేదా.? అన్న విషయమై తీవ్ర గందరగోళం నెలకొంది.

రాష్ట్రానికి మొత్తంగా మూడు రాజధానులంటూ.. వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెచ్చింది. ఆ ప్రతిపాదన ఇంకా ‘శాసన మండలి’ని దాటలేదు. దాంతో, కథ మొదటికి వచ్చింది. పోనీ, ప్రస్తుతానికి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, విశాఖతోపాటు కర్నూలు నగరాల్ని అభివృద్ధి చేస్తున్నారా.? అంటే అదీ లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తోన్న ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకుంది. రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే, ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చేయని త్యాగం అమరావతి రైతులు చేశారన్నది నిర్వివాదాంశం. ఆ త్యాగానికి తగిన ‘గౌరవం’ లేకుండా పోయిందిప్పుడు.

‘ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం..’ అని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ఏదిఏమైనా, ‘సేవ్‌ అమరావతి’ నినాదంతోపాటు, ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదాన్నీ రాష్ట్ర ప్రజలంతా భుజానికెత్తుకోవాల్సిన సందర్భమిది. ప్రత్యేక హోదా లేదు, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటో తెలియడంలేదు.. వెనుక బడిన జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన ప్యాకేజీ ఏమయ్యిందో తెలియదు.. రైల్వే జోన్‌ ఎక్కడిదాకా వచ్చిందో అర్థం కాదు.. మొత్తంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నకు సమాధానమే దొరకడంలేదు.

3 COMMENTS

  1. 438755 308030Youre so cool! I dont suppose Ive read anything such as this before. So nice to get somebody with some original thoughts on this topic. realy we appreciate you starting this up. this fabulous website are some points that is required on the internet, somebody with a bit originality. beneficial function for bringing a new challenge on the world wide internet! 945621

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...