Switch to English

చైనా యాప్స్ పై నిషేధం.. వాట్ నెక్స్ట్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

చైనా మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా వ్యవహరిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి గట్టి షాకే ఇచ్చింది. చైనా పేరు ప్రస్తావించకుండానే దేశ భద్రతకు ముప్పుగా పరిణమించినవిగా పేర్కొంటూ ఆ దేశానికి చెందిన 59 యాప్స్ ను నిషేధించింది. ఇందులో మనదేశంలో ఎక్కువమంది ఉపయోగించే టిక్ టాక్ సహా పలు ప్రముఖ యాప్ లు ఉన్నాయి. యాప్ లు నిషేధించడం ద్వారా చైనాకు చెక్ చెప్పొచ్చా అనే చర్చ జరుగుతోంది. ఇది ఒక వ్యూహం మాత్రమే.

చైనాకు సంబంధించిన వస్తువులే కాదు.. యాప్ లకు కూడా భారత్ లో మాంచి గిరాకీ ఉంది. టిక్ టాక్ కు మదేశంలో కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఏ యాప్ బ్రాండ్ వాల్యూ అయినా దానికి ఉన్న యూజర్లు, డౌన్ లోడ్లను బట్టే పెరుగుతుంది. ప్రస్తుతం భారత్ లో వాటిని నిషేధించడంతో ఆ మేరకు యూజర్లు తగ్గుతారు. ఫలితంగా వాటి బ్రాండ్ వాల్యూ కూడా తగ్గుతుంది. దీంతో ఆదాయం కూడా పడిపోతుంది. అది చైనాపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుంది.

ఇప్పటికే కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ డ్రాగన్ పట్ల రగిలిపోతున్నాయి. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన యాప్ ల వల్ల మన పౌరుల వ్యక్తిగత డేటా చోరీ అవుతుందని ఇతర దేశాలు కూడా భావించి మన బాటలోనే నిషేధిస్తే అది చైనాకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక చైనాకు చెందిన 59 యాప్ప్ నిషేధించారని తెలియగానే ఇప్పటికే వాటిని వినియోగిస్తున్న యూజర్లకు పలు సందేహాలొచ్చాయి. మన ఫోన్లలో ఉన్న ఆ యాప్ లు పని చేస్తాయా లేదా? ఇప్పటికే అందులో ఉన్న డేటా మాటేమిటి వంటి వాటిపై నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేశారు.

ప్రస్తుతం కేంద్రం నిషేధించిన 59 యాప్ ల గురించి దేశంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్సీ), టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల(టీఎస్పీ)లకు తెలియజేస్తారు. ఆయా యాప్ ల నుంచి వచ్చి వెళ్లే డేటాను బ్లాక్ చేయాల్సిందిగా సూచిస్తారు. ప్రస్తుతం నిషేధించిన యాప్స్ లో చాలా యాప్స్ ఇంటర్నెట్ ఆధారంగానే పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆయా యాప్ ల డేటాను బ్లాక్ చేస్తే అవి ఇక పనిచేయవు. భారత్ లో ఉన్నంతసేపు అవి మనుగడలో లేనట్టే.

ఒకవేళ మనం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు, అక్కడ ఈ యాప్స్ చట్టబద్ధం అయి ఉంటే, అప్పుడు పనిచేస్తాయి. కాగా, 59 యాప్స్ ని నిషేధించడంతో వాటికి ప్రత్యమ్నాయ దేశీయ యాప్స్ ఏమైనా ఉన్నాయేమోనని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఇప్పటికే టిక్ టాక్ కు స్వదేశీ రూపమైన చింగారీ యాప్ దూసుకుపోతుంది. చైనా యాప్స్ ని నిషేధించిన తర్వాత కొన్ని గంటల్లోనే ఏకంగా లక్ష డౌన్ లోడ్లు రావడం దీనికి నిదర్శనం. దీంతో ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టడానికి పలువురు అప్పుడే ఆసక్తి ప్రదర్శిస్తున్నారని చింగారీ రూపకర్తలు చెబుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...