Switch to English

రఘురాముడిపై వైసీపీ వ్యూహం ఏంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ సీపీలో ధిక్కార స్వరం వినిపిస్తూ.. సీఎం జగన్ పై మాత్రం అభిమానం కనబరుస్తూ.. సమయం ఇస్తే అన్నీ వివరిస్తానని అభ్యర్థిస్తూ.. బీజేపీపై సాప్ట్ కార్నర్ కనబరుస్తూ.. ప్రధాని మోదీపై పొగడ్తలు కురిపిస్తూ.. అసలు తన మదిలో ఏముందో బయటకు తెలియనీయకుండా జాగ్రత్తపడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పై ఏపీ అధికార పార్టీ ఏం చర్యలు తీసుకోబోతోంది? ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేక అనర్హత వేటు వేయిస్తారా? ఇదీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ.

అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ వైసీపీ నేత అందించిన సమాచారం ప్రకారం, పార్టీకి నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు ఏకంగా పార్టీ గుర్తింపును ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజుపై అధిష్టానం ఒకింత ఆగ్రహంగానే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

గతంలో జేడీయూ ఎంపీగా ఉన్న శరద్ యాదవ్ పై రాజ్యసభ చైర్మన్ అనర్హత వేటు వేశారు. ఇదే విధంగా రాజుపై కూడా వేటు వేయించాలని సర్కారు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, ఇది ఎంతవరకు సఫలమవుతుందో అనేదానిపై చర్చిస్తున్నారట . శరద్ యాదవ్ విపక్షాల ర్యాలీల్లో పాల్గొన్నారనే ఆధారాలు ఉండటంతోపాటు బీజేపీ కూడా అందుకు అనుకూలంగా ఉండటంతో వెంటనే వేటు పడింది. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు.

ఈ నేపథ్యంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న వైసీపీ.. రఘురామకృష్ణరాజు వ్యవహారం తేల్చాల్సిందిగా మచిలీపట్నం ఎంపీ బాలసౌరితోపాటు మరో ఎంపీని ఢిల్లీ పంపినట్టు చెబుతున్నారు. వారిద్దరూ లోక్ సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులతో భేటీ అయి తమ వాదన వినిపించినట్టు సమాచారం. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చి బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే వైసీపీ తన తదుపరి కార్యాచణ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ ఎంతవరకు సహకరిస్తుంది అనేది చర్చనీయాంశమైంది.

వాస్తవానికి వైసీపీకి బీజేపీ పెద్దలతో సంబంధాలు బాగానే ఉన్నాయి. రెండు పార్టీలూ పరస్పర ప్రయోజన ప్రాతిపదికనే ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగానే పరిమళ్ నత్వానీకి బీజేపీ సిఫార్సుపై రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇక బీజేపీకి రఘురామరాజు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. లోక్ సభలో అవసరమైనదాని కంటే ఎక్కువ మెజార్టీ ఉన్నందున రాజు వల్ల వారికి ఒరిగేదేమి లేదు. వైసీపీ బహిష్కరిస్తే మేం ఆశ్రయం ఇస్తామని బీజేపీ నుంచి భరోసా వచ్చిందని సమాచారం. అయితే, వైసీపీ వేటు వేయకుండా ఉంటే మాత్రం తీసుకునేది లేదని తెగేసి చెప్పారట.

పైగా ఆయన చైర్మన్ గా ఉన్న స్టాండింగ్ కమిటీ పదవీకాలం అక్టోబర్ 8తో ముగియనుంది. ఆ తర్వాత వైసీపీ నుంచి ఎలాగూ ఇచ్చే చాన్స్ లేదు. అదే బీజేపీలో చేరితే తన పరిచయాల ద్వారా మళ్లీ అలాంటి పదవి పొందే అవకాశం ఉందని, అందుకే తనపై సస్పెన్షన్ వేటు వేయించుకుని బీజేపీలో చేరాలనే యోచనతోనే కొంతకాలంగా పార్టీ మీద విమర్శలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఇప్పటివరకు ఆయన విషయాన్ని పార్టీ అధిష్టాన పెద్దలు అంతగా పట్టించుకోకుండా వదిలేశారని, కానీ ఏకంగా పార్టీ గుర్తింపునే ప్రశ్నించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆయనపై వేటు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఇక బీజేపీకి లోక్ సభ కంటే రాజ్యసభలోనే మద్దతు అవసరం. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి ఆరుగురు సభ్యులున్నారు. మరో రెండేళ్ల తర్వాత ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతగా ఉపయోగం లేని రఘురామకృష్ణ రాజు కోసం వైసీపీతో తగాదా పెట్టుకునే పనిని కమలనాథులు చేయరనే చెబుతున్నారు . మొత్తానికి రఘురాముడి భవిష్యత్తు బీజేపీ చేతిలో ఉంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

రాజకీయం

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

ఎక్కువ చదివినవి

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Tollywood: ‘సినీ వార్తల్లో జవాబుదారీతనం ఉండాలి..’ TFDMA సమావేశంలో దిల్ రాజు

Tollywood: తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్(TFJA) కు అనుబంధంగా నూతనంగా తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్(TFDMA) ఏర్పాటయింది. ఆవిర్బావ సమావేశంలో పొల్గొన్న దిల్ రాజు, దామోదర్ ప్రసాద్,  ప్రసన్నకుమార్ పాల్గొని శుభాకాంక్షలు...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ఎన్నికల సిత్రం: ప్రజాస్వామ్యంలోనూ వీళ్ళంతా ‘రాజు’లే.!

జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు చట్ట సభల్లో సీట్లు దక్కడం సాధ్యమేనా.? అంటే, దళితులకు తప్ప, ఇంకెవరికీ అది సాధ్యం కాని వ్యవహారంలా మారింది. చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్...