Switch to English

స్పెషల్ స్టోరీ: చైనా సైనికులను చీల్చి చెండాడిన ఘాతక్ కమాండోస్ గురించి తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

గాల్వాన్ లోయలో చైనా సైనికులపై విరుచుకుపడి 43 మందిని హతమార్చిన సంఘటనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైనా సైన్యం ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన టెంటును తొలగించేందుకు వెళ్లిన కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలోని సైనికులపై చైనా సైన్యం ముళ్లకంచె చుట్టిన రాడ్లు, మేకులు కొట్టిన బ్యాట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కల్నల్ సంతోష్ బెటాలియన్ ఊహించని ఈ పరిణామాన్ని వెంటనే ఎదుర్కొని చైనా సైనికుల్లో కొందరని మట్టుబెట్టగలిగింది. అయితే, మనోళ్ల కంటే చైనా సైనికులు ఆ సమయంలో ఎక్కువగా ఉండటం.. పైగా వారు దొంగ దెబ్బ తీయడంతో కల్నల్ సంతోష్ బృందం ఎక్కువగా నష్టపోయింది.

ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న మరో భారత రెజిమెంట్ చైనా వాళ్ల పని పట్టింది. ఈలోగా వీరికి తోడుగా మరో విధ్వంసక బృందం అక్కడకు దిగిపోయింది. వారే ఘాతక్ కమాండోస్. దొరికినోళ్లను దొరికినట్టుగా చీల్చి చెండాడారు. వారి ధాటికి చైనా సైన్యం అక్కడ నిలవలేక పారిపోయింది. దీంతో ఈ ఘాతక్ కమాండోస్ గురించి చాలామందిలో ఆసక్తి పెరిగింది. వారి గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో సెర్చింగ్ ఎక్కువైంది. ప్రతి దేశానికి త్రివిధ దళాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక దళాలు ఉంటాయి. ఈ దళాల శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాలుగా వారికి శిక్షణ ఇస్తారు.

భారత్ కు చెందిన ఇలాంటి ప్రత్యేక దళాల్లో ఈ ఘాతక్ కమాండోస్ ఒకటి. భారత ఆర్మీకి సంబంధించి ప్రతి ఇన్ ఫాంట్రీ బెటాలియన్ లో ఒక ఘాతక్ ప్లాటూన్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్లాటూన్ లో 20 మంది ఉంటారు. వీరిలో ఒక కమాండింగ్ ఆఫీసర్ తోపాటు ఇద్దరు నాన్ కమీషన్డ్ ఆఫీసర్స్, స్నైపర్స్, లైట్ గన్నర్స్, మెడిక్స్, రేడియో ఆపరేటర్.. ఇలా అందరితో కలిసి ఈ ట్రూప్ ఉంటుంది. ఇక వీరి దగ్గర అత్యాధునిక ఆయుధాలు, సామగ్రి ఉంటాయి. వీరు రంగంలోకి దిగితే విధ్వంసమే. వీరి ప్రధాన లక్ష్యం శత్రువులను చంపడంతోపాటు వారి ఆయుధాలను ధ్వంసం చేయడం. పైగా శత్రువులకు చాలా సమీపంలోకి వెళ్లి వారిపై విరుచుకుపడటం ఘాతక్ కమాండోల ప్రత్యేకత. నేరుగా వారితో తలపడటంలోనూ వీరు పూర్తిస్థాయి శిక్షణ పొంది ఉంటారు. ఇదే గాల్వన్ లోయలో చైనా సైనికుల పీచమణచడానికి దోహదపడింది. నేరుగా చైనా సైనికులపై విరుచుకుపడటంతో వారు పలాయం చిత్తగించాల్సి వచ్చింది.

చివరకు తమ సైనికులు ఎంతమంది చచ్చిపోయారో కూడా లెక్క బయటకు వెల్లడించలేక డ్రాగన్ కంట్రీ తేలు కుట్టిన దొంగలా మిన్నకుండిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఘర్షణల్లో అమరులైన భారత సైనికులకు సైనిక వందనంతో అంత్యక్రియలు జరిపామని, జనం వారికి జైజైలు పలికారని.. మరి చైనాలో అలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....