Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: చిరంజీవిపైకి బాలయ్యను ఎగదోస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ సినీ పరిశ్రమలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకోసం ఏర్పాటయిన విషయం విదితమే. పలువురు సినీ ప్రముఖులు ఈ బృహత్‌ కార్యక్రమానికి చిరంజీవి నేతృత్వం వహించాల్సిందిగా కోరడం, చిరంజీవి అందుకు సమ్మతించడం తెల్సిన విషయాలే. దర్శక నిర్మాత దాసరి నారాయణరావు మరణం తర్వాత టాలీవుడ్‌కి ‘పెద్దన్న’ లోటు ఏర్పడింది. ఆ ‘పెద్దన్న’ ఇప్పుడు చిరంజీవి అయ్యారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పరిశ్రమకు ఏదన్నా సమస్య వస్తే.. ఆ సమస్యను చక్కదిద్దే క్రమంలో పెద్దన్న పాత్ర కీలకం. ఈ క్రమంలో చాలా రచ్చ సినీ పరిశ్రమలో చోటు చేసుకున్నా, చివరికి చిరంజీవి నాయకత్వాన్ని మెజార్టీ సినీ ప్రముఖులు బలపర్చారు.

అయితే, తెరవెనుక మాత్రం చిరంజీవి చుట్టూ ‘కుట్ర’ కొనసాగుతూనే వుంది. ఆ మధ్య విజయ్‌ దేవరకొండ, ‘ది దేవరకొండ ఫౌండేషన్‌’ తరఫున ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడితే, అది చిరంజీవికి వ్యతిరేకంగా.. అంటూ ప్రచారం చేశారు కొందరు. దీనికి ఓ సెక్షన్‌ ఆఫ్‌ మీడియా కూడా ఆజ్యం పోసింది. ‘మా చిరంజీవిగారు..’ అని ఎప్పుడైతే విజయ్‌ దేవరకొండ అన్నాడో.. ఆ తర్వాత ఇంకో తరహా వివాదాలు సృష్టించారు.. సినీ పరిశ్రమలో అలజడి సృష్టించేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు, సినీ పరిశ్రమ కరోనా కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా చిరంజీవిని ముందు పెట్టి, ప్రభుత్వాలతో మంతనాలు జరిపేందుకు పరిశ్రమ పెద్దలు ప్రయత్నిస్తోంటే, మళ్ళీ కొత్త వివాదం మొదలైంది.

‘రియల్‌ ఎస్టేట్‌’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు, దాంతోపాటుగా ‘బీప్‌’ వర్డ్‌ ఆయన ఉపయోగించడం.. వెరసి పరిశ్రమలో తీవ్ర గందరగోళం నెలకొంది. చిరంజీవికి వ్యతిరేకంగా ఎవరూ ప్రస్తుతానికి నినదించకపోయినా, బాలయ్యకు మద్దతుగా మాట్లాడుతున్నవారిలో చాలామంది చిరంజీవిపై వ్యతిరేకతను పరోక్షంగానే చాటుకుంటున్నారు. అయినా, చిరంజీవికి ‘పెద్దన్న’ పాత్ర పోషించాల్సిన అవసరమేంటి.? అది ఆయన బాధ్యతగా భావించారు. ‘ఇదివరకటిలా సినిమాల్లో అమ్మడూ.. కుమ్ముడూ.. అంటూ వేషాలేయడం కుదరదు కాబట్టి.. వయసు మీద పడ్తోంది కాబట్టి..’ అంటూ ఓ అర్థం పర్థం లేని కామెంట్‌ చిరంజీవి మీద ఓ సెక్షన్‌ ఆఫ్‌ పీపుల్‌ లీకుల రూపంలో పంపుతున్నారు. సిగ్గుమాలిన కామెంట్‌ ఇది. చిరంజీవి స్టామినా ఏంటో.. ఆయన రీ-ఎంట్రీ చెప్పకనే చెప్పింది.

చిరంజీవి ఎవరితోనూ శతృత్వాన్ని కోరుకోరు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ ఇప్పటిదాకా చిరంజీవిలో అందరితోనూ ‘కలివిడిగా’ వుండాలనే అనుకుంటారు. అదే ఆయన బలం, బలహీనత కూడా. చిరంజీవికీ బాలయ్యకీ సన్నిహిత సంబంధాలే వున్నాయనది అందరికీ తెల్సిన విషయమే. కానీ, బాలయ్య ఎందుకలా ‘బీప్‌’ పదాన్ని చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమ శ్రేయస్సు కోసం జరుగుతున్న ప్రక్రియ విషయంలో ప్రస్తావించినట్లు.? అంటే, ఇక్కడ ఎవరో బాలయ్యను చిరంజీవిపైకి ఎగదోస్తున్నారన్నమాట. ఎవరది.? పరిశ్రమలో రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి ఈ విషయమై. దానికి తోడు, ఓ సెక్షన్‌ ఆఫ్‌ మీడియా.. చిరంజీవిపై తమకున్న వ్యతిరేకతను ఇప్పుడిలా ఇంకాస్త వాడి వేడిగా వడ్డిస్తూ పండగ చేసుకుంటుండడం కొసమెరుపు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...