కరోనా కారణంగా ఎప్పుడు లేనిది సినిమా స్టార్స్ ఏకంగా రెండు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. షూటింగ్స్, ప్రమోషన్స్, పార్టీలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే సెలబ్రెటీలకు లాక్డౌన్ కొత్తగా ఉందంటున్నారు. కొందరు లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు మాత్రం బోర్ కొడుతుంది మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయా అంటూ ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఈ సమయంను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేందుకు కేటాయించారు. తాజాగా లాక్‌డౌన్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మాత్రం చాలా ఫన్నీగా స్పందించాడు.
లాక్ డౌన్ అందరికి రెండు నెలలుగా ఉంది. కాని నాకు మాత్రం 20 ఏళ్లుగా లాక్ డౌన్లోనే ఉన్నట్లుగా ఉందంటూ పోస్ట్ పెట్టాడు. తన భార్య కాజోల్‌తో ఉన్న పాత ఫొటోను పోస్ట్ చేసిన అజయ్ దేవగన్ ఇరువై ఏళ్ల క్రితమే లాక్డౌన్ ప్రారంభం అయ్యిందన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
హల్చుల్ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు అప్పటి నుండే ప్రేమలో పడ్డారు. ఒకరంటే ఒకరు ఇష్టపడ్డ వీరిద్దరు 1999లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు కలిసి నటించారు. వీరు ఇద్దరు పిల్లలతో సంసార జీవితాన్ని చాలా సంతోషంగా సాగిస్తున్నారు. అజయ్ దేవగన్ ప్రస్తుతం వరుసగా హిందీ చిత్రాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ఈయన తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా చేస్తున్న విషయం తెల్సిందే.
Feels like it’s been twenty two years since the lockdown began.#FridayFlashback@itsKajolD pic.twitter.com/CctxqUZZkv
— Ajay Devgn (@ajaydevgn) May 8, 2020
3526 362964articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 747584
648403 324788Terrific paintings! That is the type of info that are meant to be shared about the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on more than and consult with my site . Thank you =) 852943