Switch to English

ఇద్దరు పిల్లలను కాపాడిన ఐఏఎస్ సంకల్పం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ముంబైలో మూడున్నరేళ్ల పిల్లాడు. ఆటిజంతో బాధపడుతున్నాడు. ఒంటె పాలు, కొన్ని రకాల పప్పులు మాత్రమే ఆహారం. ఇంక ఏం పెట్టినా పడదు. లాక్ డౌన్ నేపథ్యంలో భారత్ లో రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. దీంతో ఆ పిల్లాడి ఇంట్లో ఉన్న ఒంటెపాలు ఇంక నాలుగు రోజులకు మించి రావు. ముంబైలో ఎక్కడా దొరకడంలేదు. రాజస్థాన్ లోని సద్రి నుంచి తేవడం ఒక్కటే మార్గం. కానీ లాక్ డౌన్ లో అదెలా సాధ్యం? ఒంటె పాలు లేకపోతే ఆ పిల్లాడి ప్రాణాలకే ముప్పు. దీంతో ఆ పిల్లాడి తల్లి నేహా సిన్హా వెంటనే ఈ విషయాన్ని వివరిస్తూ ప్రధానికి ట్వీట్ చేసింది. అనంతరం ఇది రీట్వీట్ అవుతూ చాలామందిని చేరింది.

ఒడిశాలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న అరుణ్ బోత్రా దీనిని చూశాడు. రాజస్థాన్ కే చెందిన ఆయన.. ఎలాగైనా ఆ పిల్లాడిని కాపాడాలని భావించారు. వెంటనే ఫోన్ తీసుకున్నారు. తనకు ఉన్న పరిచయాల ద్వారా రాజస్థాన్ సద్రిలోని ఒంటెపాల వ్యాపారులను కాంటాక్ట్ చేశారు. వారు పాలు పంపించడానికి ఓకే చెప్పారు. మరి అక్కడి నుంచి ముంబై రావాలంటే ఎలా? వెంటనే రైల్వేలో ఉన్నతాధికారిగా ఉన్న తన స్నేహితుడు తరుణ్ జైన్ ను సంప్రదించారు. ప్రస్తుతం లూథియానా నుంచి ముంబైకి ఓ పార్సిల్ ట్రైన్ వెళ్లనుందని, పాలు తీసుకొచ్చి తనకు అందజేస్తే దానిని ముంబై చేరుస్తామని హామీ ఇచ్చారు.

వెంటనే పాల వ్యాపారికి ఫోన్ చేయగా.. తమకు ఫాల్నా స్టేషన్ దగ్గర అని, అక్కడకు తీసుకొచ్చి పాలు అందజేస్తానని చెప్పాడు. అయితే, ఆ ట్రైన్ కి ఫాల్నా స్టేషన్ లో స్టాప్ లేదు. కానీ రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో స్పందించారు. పాల పార్సిల్ తీసుకోవడానికి ఫాల్మా స్టేషన్ లో రైలు ఆపేందుకు అనుమతి ఇచ్చారు. అంతే.. సదరు పాలవ్యాపారి 20 లీటర్ల పాలు,15 కిలోల పాలపొడి తీసుకుని వచ్చి ఫాల్నా స్టేషన్ లో ఇవ్వడం.. అది ముంబైలోని ఆ పిల్లాడి ఇంటికి చేరడం చకచకా జరిగిపోయాయి.

సరిగ్గా ఇక్కడే మరో సంఘటన జరిగింది. తమ పిల్లాడికి కూడా ఒంటెపాలు కావాలని, తనకూ సాయం చేయాలని ముంబైకి చెందిన మరో మహిళ కోరింది. కానీ అప్పటికే ట్రైన్ ముంబై వచ్చేయడంతో ప్రస్తుతానికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో నేహా సిన్హా ముందుకొచ్చారు. బిడ్డ ఎవరికైనా బిడ్డే కాదా? 5 లీటర్ల పాలు, 5 కిలోల పాలపొడి ఆ తల్లికి ఇస్తానని పేర్కొన్నారు. అదీ తల్లి మనసంటే. మొత్తమ్మీద ఓ అధికారి సంకల్పం ఇద్దరి పిల్లల ప్రాణాలను కాపాడింది. దీంతో అటు అరుణ్ బోత్రాకు, ఇటు రైల్వే అధికారులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...