Switch to English

ప్చ్.. చంద్రబాబు ఎవరికీ పట్టడంలేదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

లాక్ డౌన్ వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ వచ్చిన ఆయన.. అక్కడే ఉండిపోయారు. ప్రతిరోజూ మీడియాలో కనపడాలని తపనపడే నేతల్లో బాబు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారనే టాక్ ఉంది. ఏ పని చేసినా దానికి తగిన ప్రచారం చేసుకోవడంతో ఆయన్ను మించినవారు లేరని అంటుంటారు. అలాంటిది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో సహజంగానే ఎవరికీ రాజకీయాలు చేసే పరిస్థితి లేకపోయింది. దీంతో బాబుకు ఏమి చేయాలో తోచడంలేదు.

పైగా అమరావతిలో ఉంటే పార్టీ నేతలతో సమావేశాలో, సమీక్షలో అంటూ ఏదో ఒకటి చేసే వీలు కలిగేది. కానీ హైదరాబాద్ లో ఉండటం వల్ల అది కూడా కుదరడంలేదు. ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. విమర్శలకు ఇది సమయం కాదంటూనే ఏపీ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఓ పక్క ఏపీ సీఎం జగన్ ను విమర్శిస్తున్నా.. మరోవైపు ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ఎలాగైనా మళ్లీ ఎన్డీఏ పక్షాన చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బాబు ఎంతగా చేయి చాపుతున్నా.. మోదీ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ పొడిగింపు వంటి అంశాలపై ప్రధాని అందరి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. సీఎంలతోపాటు దేశంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. కానీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు మాత్రం మోదీ నుంచి ఫోన్ రాలేదు. ఇది బాబుకు మరింత ఇబ్బందిగా మారింది.

ఏపీ సీఎం జగన్ తన సలహాలు తీసుకోవాలంటూ ఆయన పదేపదే కోరే పరిస్థితికి వచ్చారు. మనం ఇతరుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తామో, వారు కూడా మన పట్ల అదే విధంగా వ్యవహరిస్తారనే లాజిక్కును బాబు మరచిపోయినట్టున్నారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత అభిప్రాయాలను ఎన్నడూ తీసుకుంది లేదు. అలాంటిది ఇప్పుడు ఆయన అభిప్రాయాలు సీఎం తీసుకోవాలని ఎలా ఆశిస్తారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు దేశ రాజకీయాల్నే శాసించిన చంద్రబాబు ఇప్పుడు ఎవరికీ పట్టడంలేదనే చర్చ జరుగుతోంది. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...