Switch to English

భయపెడ్తున్న ‘మళ్ళీ లాక్‌డౌన్‌’ పుకార్లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఏది నిజం.? ఏది అబద్ధం.? ఏమీ అర్థం కాని పరిస్థితి. ‘అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి.. పుకార్లను అస్సలేమాత్రం నమ్మొద్దు.. లాక్‌డౌన్‌ కొనసాగింపు ఆలోచనల్లేవు..’ అని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నా, ఏప్రిల్‌ 14 తర్వాత నిజంగానే లాక్‌ డౌన్‌ ఎత్తేస్తారా.? లేదంటే, కొనసాగిస్తారా.! అన్నదానిపై ఇంకా అనుమానాలు అలాగే వున్నాయి. ఓ వారం రోజులపాటు ‘సడలింపు’ ఇచ్చి, మళ్ళీ లాక్‌ డౌన్‌ కొనసాగిస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే, ఆ పరిస్థితి వుండకపోవచ్చనీ, ఏప్రిల్‌ 14తో లాక్‌ డౌన్‌ ముగుస్తుందనీ.. అదే సమయంలో కొన్ని రోజులపాటు కొన్ని ఆంక్షలు కొనసాగుతాయనీ ఢిల్లీ వర్గాల నుంచి లీకులు పుట్టుకొస్తున్నాయి. లాక్‌ డౌన్‌ ఎదుర్కోవడం ఇటు ప్రజలకే కాదు, అటు కేంద్ర ప్రభుత్వానికీ చాలా కష్టమైన వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వాల సంగతి సరే సరి. లాక్‌ డౌన్‌ అనేదే తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టుకొచ్చిన వ్యవహారం. కరోనా వైరస్‌కి అడ్డుకట్ట వేయడానికి ‘సోషల్‌ డిస్టెన్స్‌’ తప్ప ఇంకో మార్గం లేదు గనుక, ఆర్థికంగా తీవ్ర నష్టమని తెలిసీ కేంద్రం లాక్‌ డౌన్‌ని ప్రకటించింది.

లాక్‌ డౌన్‌ దెబ్బకి రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయంటూ ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, లాక్‌డౌన్‌ని ఇంకొన్నాళ్ళు కొనసాగించకపోతే, దేశ ప్రజలు చేసిన త్యాగానికి అర్థం వుండదనే చర్చ కూడా తెరపైకొస్తోంది. కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో, ఇప్పుడు లాక్‌డౌన్‌ని ఎత్తివేయడం వల్ల పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందన్నది వారి వాదన.

ఏదిఏమైనా, దేశం ముందెన్నడూ ఎదుర్కోనంత పెద్ద విపత్తు ఇది. ఈ విపత్తు నుంచి దేశం బయటపడాలని 130 కోట్ల మంది ప్రజానీకం ముక్తకంఠంతో కోరుకుంటోంది. కష్ట కాలంలో మనమంతా ఒక్కటేనని ఇప్పటికే పలుసార్లు భారతీయులమంతా నినదించాం.. నిరూపించాం.. నిరూపిస్తున్నాం కూడా. ఈ నేపథ్యంలో ‘మళ్ళీ లాక్‌డౌన్‌’ వంటి పుకార్లపై ఇంకోసారి కేంద్రం స్పష్టతనివ్వాల్సి వుంటుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...