Switch to English

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి మూవీ రివ్యూ

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1.5/5

నటీనటులు: ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ..
నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌
దర్శకత్వం: బాలు అడుసుమిల్లి
సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని
మ్యూజిక్: వికాస్‌ బాడిస
ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్
రన్ టైం: 2 గంటల నిముషాలు
విడుదల తేదీ: మార్చి 06, 2020

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు పోషించిన ఈ ఫన్ రైడ్ థ్రిల్లర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నలుగురు అందమైన భామలు కలిసి చేసిన కామెడీ అండ్ థ్రిల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

కథ:

ధన్య(ధన్య బాలకృష్ణ), త్రిధ(త్రిధ చౌదరి), సిద్ది(సిద్ది ఇదాని), కోమలి(కోమలి ప్రసాద్)లు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ లైఫ్ లో రకరకాల పరిస్థితుల వల్ల చిరాకుతో ఉంటారు, ఆ టైంలో ఒక ఫ్రెండ్ పెళ్లి కోసం అందరూ కలిసి గోవాకి వెళ్తారు. అక్కడ ఒక మేల్ ప్రాస్టిట్యూట్ ని బుక్ చేసుకుంటారు. కానీ అనుకోకుండా ఈ నలుగురి చేతిలో అతను చనిపోతాడు. ఇక అక్కడి నుంచీ ఆ శవాన్ని మాయం చేయడం కోసం, ఆ మర్డర్ నుంచి బయటపడడం కోసం నాలుగురు అమ్మాయిలు ఏం చేశారు అనేదే కథ.

తెర మీద స్టార్స్..

‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఓ అడల్ట్ కామెడీ బొమ్మ, అందులోనూ అందమైన నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ అందరూ గ్లామర్ షో ఆశిస్తారు. ఆ పరంగా కోమలి ప్రసాద్, సిద్ది ఇదాని మెప్పించారు. ఇక ఉన్నంతలో నటన పరంగా కూడా వీరిద్దరే కాస్త ఎక్స్ప్రెసివ్ పెర్ఫార్మన్స్ చేశారు. మిగిలిన ధన్య బాలకృష్ణ, త్రిధ చౌదరి జస్ట్ ఓకే. మిగిలిన నటీనటులకు కూడా సరైన పాత్రలు లేకపోవడం వలన పెర్ఫార్మన్స్ చాలా తేలిపోయింది.

తెర వెనుక టాలెంట్..

ఎడారిలో అక్కడక్కడా దొరికే ఓయాసిస్ లా అక్కడక్కడా వికాస్ బాడిస బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శేఖర్ గంగమోని విజువల్స్ చాలా బాడ్ గా ఉన్నాయి. ఈ మధ్య కుర్రాళ్ళు చేతిలోని మొబైల్స్ లోనే బెస్ట్ షాట్స్ తీస్తున్నారు. కానీ ఇతను మంచి కెమెరాస్, గోవా లాంటి లొకేషన్స్ ఇచ్చినా ది వరస్ట్ విజువల్స్ ఇచ్చాడు. తెల్లగుటి మణికాంత్ కి ఏది కట్ చేయాలో అర్థంకాక తనకు అనిపించి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

ఇక డెబ్యూ డైరెక్టర్ బాలు అడుసుమిల్లి విషయానికి వస్తే.. హాలీవుడ్ లో వచ్చిన ‘రఫ్ నైట్’ సినిమాకి స్ఫూర్తిగా తీసిన ఈ సినిమా అందులో ఒక 10% కూడా లేదు. ఏ సినిమాని స్ఫూర్తిగా తీసుకున్నా పర్లేదు, కానీ కీ పాయింట్ మన నేటివిటీకి తగ్గట్టుగా పెట్టుకోవాలి కానీ అలంటి పాయింట్ లేదు. పోనీ నాలుగు పాత్రలున్నాయి, ఆ పాత్రల్లో నుంచైనా మనం కనెక్ట్ అవ్వాలి, అదీ లేదు. దాంతో ఇలా తలా తోక లేని ఈ సినిమా ఎలా పడితే అలా వెళ్తుంది. మెచ్యూరిటీ లేని కథ, కథనం, డైరెక్షన్ తో సినిమాని పరమ బోర్ కొట్టించాడు. కేవలం అడల్ట్ కంటెంట్, భూతు డైలాగ్స్ ఉంటే సినిమా ఆడేస్తుందనుకోవడం డైరెక్టర్ భ్రమ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చెప్పుకునేలా లేవు.

విజిల్ మోమెంట్స్:

– కోమలి ప్రసాద్, సిద్ది ఇద్నాని స్కిన్ షో
– అక్కడక్కడా మెప్పించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– కథ
– బోరింగ్ కథనం
– పనికిమాలిన అడల్ట్ కామెడీ
– వీక్ డైరెక్షన్
– ఒక్క ఎలిమెంట్ కూడా వర్కౌట్ కాకపోవడం

విశ్లేషణ:

నలుగురు హీరోయిన్స్, అడల్ట్ కామెడీ మూవీ.. సో స్కిన్ షో, మంచిగా నవ్వుకోవచ్చు అని ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ అనే సినిమాకి వెళ్లారో ‘ఎంజాయ్ చేద్దామనుకున్నాం కానీ టార్చర్ చూపించారు అనే ఫీలింగ్ తో బయటకి వస్తారు. 2 గంటల సినిమాలో ఓవరాల్ గా 5 నిమిషాల స్కిన్ షో కోసం మీ డబ్బులు, సమయం ఎందుకు వృథా చేసుకోవడం చెప్పండి..

ఇంటర్వల్ మోమెంట్: వామ్మో.. ఇక సెకండాఫ్ కూడా చూడాలా.!

ఎండ్ మోమెంట్: రియలైజ్ అయ్యి ఇంటర్వల్ లోనే వెళ్ళిపోయి ఉండాల్సింది.

చూడాలా? వద్దా?: పిచ్చ లైట్.!

బాక్స్ ఆఫీస్ రేంజ్: కాస్తో కూస్తో తెలిసిన నలుగురు హీరోయిన్స్, అడల్ట్ కామెడీ అనే టాగ్ వలన సింగిల్ స్క్రీన్స్ లో ఇవాళ కొంత ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ సినిమా నిలబడడం, ప్రాఫిట్స్ తెచ్చుకోవడం చాలా కష్టం.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1.5/5

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: పనులు వదిలేసి మసాజ్ చేయించుకున్న VRO

ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరికి మోజు. ఎందుకంటే పని చేసినా చేయకున్నా అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడు వచ్చినా పోయినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. అందుకే చాలా మంది ప్రభ్యుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారు....

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...

క్రైమ్ న్యూస్: గొర్రెకుంట మృత్యుబావి మిస్టరీలో మరో ట్విస్ట్.!

ఈ రోజు ఉదయమే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల మర్డర్ కి కారణమైన సంజయ్ కుమార్ యాదవ్ నిజానిజాలు ఒప్పుకోవడంతో ఈ మృత్యుబావి మిస్టరీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

క్రైమ్ న్యూస్: పెళ్లి చేసుకుంటానంటూ వివాహితపై అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో ఒక మహిళ తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరి జీవితంను గడుపుతుంది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. కూతురుతో ఒంటరిగా జీవితాన్ని...