Switch to English

వైఎస్‌ జగన్‌.. ఈ సారి కాస్త జాగ్రత్త పడినట్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. నిజానికి, ఈ విషయమై నిన్న మొన్నటిదాకా పెద్ద రాద్ధాంతమే జరిగింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయి. దానికి కారణం కరోనా వైరస్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటికే ప్రారంభమైన పరీక్షల్ని ఎలాగోలా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా, హైకోర్టు జోక్యంతో పదో తరగతి పరీక్షలకు మధ్యలోనే బ్రేక్‌ పడింది.

ఆ విషయం గుర్తించి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుగానే పదో తరగతి పరీక్షల్ని వాయిదా వేసి వుండాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, మీడియా ముందుకొచ్చినప్పుడు కూడా పదో తరగతి పరీక్షల రద్దు అంశం మీడియా నుంచి ప్రస్తావనకు వచ్చింది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించలేదు. ‘తెలంగాణలో పరీక్షలు వాయిదా వేశారు కదా.. హైకోర్టు ఆపేయమని చెప్పింది కదా..’ అనడిగితే, ప్రభుత్వం నుంచి సరైన సమాధానమే రాలేదాయె. స్థానిక ఎన్నికల విషయంలోనూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ఇదే మొండి వైఖరి ప్రదర్శిస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

దాన్ని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా, ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జిల్లాల మధ్య కూడా రాకపోకలు బంద్‌ అయిపోయిన దరిమిలా, పదో తరగతి పరీక్షల నిర్వహణ అసాధ్యం. ఈ పరిస్థితి వస్తుందని గత కొద్ది రోజుల నుంచే ప్రచారం జరుగుతున్నా, ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మొత్తమ్మీద, పదో తరగతి పరీక్షల వాయిదా ప్రకటనతో, ఇటు విద్యార్థుల్లోనూ టెన్షన్‌ తగ్గినట్లయ్యింది.. అటు విద్యార్థుల తల్లిదండ్రులకీ తలనొప్పి తగ్గినట్లయ్యింది.

స్థానిక ఎన్నికల కారణంగా ఇప్పటికే ఓ సారి వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు, కరోనా వైరస్‌ కారణంగా మరోసారి వాయిదా పడ్డాయి. పరీక్షల కంటే ఎన్నికలే ముఖ్యమని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావించడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడ్డం ఆహ్వానించదగ్గ విషయమే.. పరీక్షల కంటే ప్రాణాలు ఎక్కువ కాదు కదా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...