Switch to English

బాలీవుడ్‌కు పయనమైన భీష్మ

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రం ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన విషయం తెల్సిందే. మంచి విజయాన్ని దక్కించుకున్న భీష్మ చిత్రం నితిన్‌ కెరీర్‌లో చాలా కాలం తర్వాత ఒక సక్సెస్‌ను ఇచ్చింది. భీష్మ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను కూడా తెచ్చి పెట్టింది. యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌ అవ్వడంతో ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు హిందీలో రీమేక్‌ అవ్వడం చాలా కామన్‌ అయ్యింది. ఇప్పటికే పలు సినిమాలు రీమేక్‌ అయ్యి సూపర్‌ హిట్‌ అవ్వగా ప్రస్తుతం కొన్ని సినిమాలు రీమేక్‌ అవుతున్నాయి. తాజాగా భీష్మ చిత్రం కూడా హిందీ రీమేక్‌కు సిద్దం అయ్యింది. ప్రముఖ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ దాదాపుగా అయిదు కోట్ల రూపాయలకు ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

భీష్మ చిత్రం రీమేక్‌లో నితిన్‌ పాత్రను రణబీర్‌ కపూర్‌ పోషించబోతున్నాడట. ఇక హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించగా అక్కడ ఎవరు నటించబోతున్నారు అనే విషయమై క్లారిటీ రాలేదు. అనన్య పాండేతో పాటు ఇంకా కొందరి పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ రీమేక్‌కు దర్శకత్వం ఎవరు చేసేది అనే విషయంలో త్వరలో కరణ్‌ జోహార్‌ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలుగులో హిట్‌ అయిన భీష్మ హిందీలో ఏ స్థాయిలో సక్సెస్‌ అవుతుందో చూడాలి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: మానవత్వానికే మచ్చ.. కరోనా భయంతో నర్సును అలా వదిలేశారు

కరోనా బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వైద్యులు. వారితోపాటు నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కానీ.. అదే పారా...

ప్రపంచ అత్యంత వయో వృద్దుడు మృతి

ప్రపంచంలోనే అతి పెద్ద వయసు వ్యక్తిగా బాబ్‌ వెయిటన్‌ రికార్డు సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన చిటెట్సు మృతి చెందడటంతో అత్యంత వృద్దుడిగా అధిక వయసు కలిగిన వ్యక్తిగా బాబ్స్‌...

బన్నిలా నన్ను తప్ప వేరొకరిని ఊహించుకోలేనంటున్న బాలీవుడ్ హీరో.!

అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని...

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....

కరోనాకి అన్ లాక్.. కేసులు పైపైకి..!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జాన్ బీ.. జహాన్ బీ అనే నినాదంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్ డౌన్...