Switch to English

సీఏఏకి వ్యతిరేక తీర్మానం: కేసీఆర్‌ ఏం సాధించినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. తనకు సైతం జనన ధృవీకరణ పత్రం లేదనీ, తనలాంటి వారు లక్షలాది మంది వుంటారనీ ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రసంగం పట్ల మిత్రపక్షం మజ్లిస్‌ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ విషయంలో తెలంగాణలోని అధికార పార్టీకి మద్దతు పలకడం గమనార్హం.

కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాత్రం తీర్మానం తాలూకు ప్రతుల్ని చింపి పారేసి, తన నిరసనను వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొంత గందరగోళం నెలకొన్న మాట వాస్తవం. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటికే కేంద్రం ఒకటికి పదిసార్లు వివరణ ఇచ్చింది. సీఏఏ కావొచ్చు, ఎన్‌పిఆర్‌ కావొచ్చు, ఎన్‌ఆర్‌సి కావొచ్చు.. ఇవేవీ భారతదేశంలో నివసిస్తోన్న భారతీయులెవరికీ సమస్యలు సృష్టించేవి కావని అంటోంది కేంద్రం.

కానీ, ప్రజల్లో.. మరీ ముఖ్యంగా మైనార్టీల్లో కొంత అభద్రతాభావం నెలకొంది. అది కూడా, రాజకీయ నాయకులు ప్రేరేపించిన అభద్రతా భావమేనన్నది ఇంకో వాదన. ఆ సంగతి పక్కన పెడితే, ఓ రాష్ట్ర అసెంబ్లీ సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే ఏమవుతుంది.? తక్షణం కేంద్రం, ఈ వ్యవహారం నుంచి వెనక్కి తగ్గే అవకాశం వుండదుగాక వుండదు. ఒక్క రాష్ట్రమే కాదు, మరికొన్ని రాష్ట్రాలూ వ్యతిరేకించినా.. కేంద్రం వెనకడుగు వేయకపోవచ్చు.

ఎందుకంటే, సీఏఏని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌. ఈ సీఏఏ సెగల నేపథ్యంలోనే ఢిల్లీ అట్టుడికినా కేంద్రం కాస్త కూడా బెదరలేదంటేనే.. కేంద్రం, సీఏఏ విషయంలో ఎంత ఖచ్చితత్వంతో వుందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు సంబంధించిన బిల్లుని, అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరిస్తూ తీర్మానం చేసిన విషయం విదితమే.

అయినా, పార్లమెంటులో బిల్లు పాస్‌ అయ్యింది. దాన్ని ఇప్పుడు కొందరు ప్రస్తావిస్తూ, రాష్ట్రాల అసెంబ్లీలు చేసే తీర్మానాలకు విలువెంత.? అన్న చర్చను తెరపైకి తెస్తున్నారు. ఇదిలా వుంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కూడా సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న ఆలోచనతో అక్కడి అధికార వైఎస్సార్సీపీ వున్న విషయం విదితమే. అయితే, ఆ వైసీపీనే, సీఏఏకి పార్లమెంటు సాక్షిగా మద్దతు తెలపడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...