Switch to English

జగన్‌ అసహనం: ఎన్నికల కమిషనర్‌పై ‘కులం’ ముద్ర

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి అనాల్సిన మాటలేనా అవి.? ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై కులం ముద్ర వేయడమా.? అది కూడా ఎన్నికల కమిషనర్‌ మీద. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ‘కులం ముద్ర’ వేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

‘సంబంధిత కార్యదర్శికి కూడా తెలియకుండా ప్రకటన చేశారు.. ఎవడో రాసిస్తే, దాన్ని ఈయన చదివారు.. చంద్రబాబు హయాంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్‌కుమార్‌ని నియమించారు.. ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నారా.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

ఎన్నికల వేళ, ఆరోపణలు వచ్చిన పోలీస్‌ అధికారులపైనా, ఇతర అధికారులపైనా రాష్ట్ర ఎన్నికల సంఘం కావొచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావొచ్చు స్పందించడం మామూలే. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి చీఫ్‌ సెక్రెటరీ అనిల్‌ చంద్ర పునేటాపై వేటు పడింది. ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపైనా వేటు పడింది. అది వైసీపీ ఆరోపణల నేపథ్యంలోనే జరిగింది. అప్పుడు అది రైటు.. కానీ, ఇప్పుడది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఘోర తప్పిదంగా కన్పిస్తోంది.

పైగా, అధికారుల మీద కులం ముద్ర వేయడం. సాక్షాత్తూ ముఖ్యమంత్రే, అధికారుల మీద కులం ముద్ర వేసే.. వ్యవస్థలు నడిచేదెలా.? అన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. వైఎస్‌ జగన్‌ చెబుతున్నదాన్నిబట్టి ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారుల మాటేమిటి.? వాళ్ళంతా అధికార వైసీపీ చెప్పు చేతల్లో నడుస్తున్నారా.? ఇతర కులాలకు చెందిన అధికారుల గురించి ఏమనుకోవాలి.?

కులాల కుంపట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడో రాజేసుకున్నాయి.. ఎవరికి తోచిన తీరున వారు బడబాగ్నిని రగల్చుకుంటూ పోతున్నారంతే.. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ పేల్చిన ‘కులం బాంబు’ రాష్ట్రంలో అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...