ప్రస్తుతం క్రికెటర్ల బయోపిక్‌లు వరుసగా వస్తున్నాయి. ధోని, సచిన్‌ల సినిమాలు ఇప్పటికే విడుదల అవ్వగా ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కుతుంది. ఇదే సమయంలో లేడీ క్రికెటర్స్ అయిన మిథాలీ రాజ్ ఇంకా కొందరి క్రీడాకారులపై కూడా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ టీం ఇండియా కెప్టెన్ సౌరబ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
గంగూలీ గతంలో అద్బుత విజయాలను ఇండియాకు అందించాడు. ప్రపంచ కప్‌లో కూడా కీలక విజయాలు ఆయన కెప్టెన్సీలో దక్కాయి. ఒక్క వరల్డ్ కప్ గెలవలేదు అనే కాని ఆయన సారధ్యంలో మంచి విజయాలు టీఇండియా అందుకుంది. ఆయన సారధ్యంలోనే పలువురు ప్రముఖ క్రికెటర్లు పరిచయం అయ్యారు. ఇక ఆయన జీవితం కూడా సినీ కథకు దగ్గరగా ఉంటుందట. అందుకే ఆయన బయోపిక్‌ను తీస్తే బాగుంటుందని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ భావిస్తున్నాడు.
కరణ్ జోహార్ ఇప్పటికే గంగూలీ నుండి పర్మీషన్స్ తీసుకున్నాడని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. ఇక గంగూలీ పాత్రను హృతిక్ రోషన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి గంగూలీ బయోపిక్ వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఫుల్ జోష్ అండ్ హ్యాపీగా ఉన్నారు. ఇది 2022వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
955458 935544This internet website is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and you will surely discover it. 470025