Switch to English

ఈ వైఫల్యాలపై వైఎస్‌ జగన్‌ పెదవి విప్పరెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో కంటే పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువ. ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో పెట్రోల్‌ బంకుల వద్ద బోర్డులు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. మరోపక్క, రాష్ట్రంలో రాజధాని విషయమై గడచిన ఎనిమిది నెలలుగా నెలకొన్న అనిశ్చితితో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు పరుగులు పెడుతున్నాయి.

మొన్న కియా వ్యవహారంలో ఎంత రగడ చోటు చేసుకుందో చూశాం. ప్రభుత్వం రంగంలోకి దిగి, డ్యామేజీ కంట్రోల్‌ చర్యలు చేపట్టినా.. ఇంకా అనుమానాలు మాత్రం అలాగే వున్నాయి. మరోపక్క, ఇతర రాష్ట్రాలు కియా పరిశ్రమతో సంప్రదింపులు జరుపుతుండడం గమనార్హం.

ఇదిలా వుంటే, అదానీ గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌లో 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకొచ్చిన మాట వాస్తవం. అది చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందం. కానీ, అదంతా ఉత్తదేనని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. ‘3 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టలేం..’ అని అదానీ గ్రూప్‌ తేల్చి చెప్పిందని సాక్షాత్తూ సంబంధిత మంత్రి వెల్లడించారు. ‘70 వేల కోట్లు.. అనేది అప్పటి ఒత్తిళ్ళ మేరకు జరిగిన ఒప్పందం మాత్రమే..’ అని అంటున్నారాయన.

నిజానికి, ఈ తరహా ఒప్పందాలు కుదిరినప్పుడు, పరిస్థితుల్ని అందుకు అనుకూలంగా, వీలైతే.. ఇంకా అనుకూలంగా మలచితే.. ఇంకాస్త ఎక్కువ పెట్టుబడులు వస్తాయి. పరిస్థితులు అనుకూలించకపోతే.. ప్రాజెక్టులు వెనక్కి పోతాయి. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో.. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అలజడి సృష్టించిన మాట వాస్తవం. గత ఒప్పందాల్ని గౌరవించకుండా ‘రివర్స్‌’ రాజకీయం షురూ చేస్తే, తదుపరి ప్రభుత్వం ఇంకెలా వ్యవహరిస్తుందోనన్న ఆందోళనలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచడం సహజమే.

ఏదిఏమైనా, ఈ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవాల్సి వుంటుంది. ఈ వైఫల్యాల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అడ్రస్‌ చెయ్యాల్సి వుంది. సమస్యల్ని అధిగమించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందడుగు వేయాలి. కానీ, ఆ దిశగా ప్రభుత్వం తరఫున చర్యలేమీ కన్పించడంలేదు. ఏడాది పాలన త్వరలో పూర్తి చేసుకోనున్నారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఇంకా, రాష్ట్రంలో ఈ అనిశ్చితి కొనసాగడం రాష్ట్ర భవిష్యత్తుకి అస్సలేమాత్రం మంచిది కాదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...