Switch to English

భీష్మ టైటిల్ వివాదం: రిలీజ్ కష్టాల్లో నితిన్ అండ్ కో

యంగ్ హీరో నితిన్ భీష్మ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న విజయం తనను వరిస్తుందని ఆశాభావంతో ఉన్నాడు. దానికి తగ్గట్లుగానే భీష్మ కూడా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ అన్నీ సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ ను కలిగించడంలో విజయవంతమయ్యాయి. ఇప్పటిదాకా అ.. ఆ నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కాగా దాన్ని భీష్మతో బీట్ చేయాలని చూస్తున్నాడు. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ ఉందనగా ఇప్పుడు ఈ చిత్రానికి విడుదల అడ్డంకులు మొదలయ్యాయి.

ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషన్ గా మారిపోయింది.. సినిమా టైటిల్ వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ గొడవ చేయడం. గతేడాది వాల్మీకి చిత్రానికి ఇలాంటి టెన్షన్స్ వస్తేనే ఆఖరి నిమిషంలో చిత్ర పేరుని గద్దలకొండ గణేష్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భీష్మ టైటిల్ మార్చకుంటే సినిమా స్క్రీనింగ్ ను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు బిజెపి ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీ కృష్ణ చైతన్య, ప్రిన్సిపాల్ సెక్రటరీ రత్నాకరం రాము తదితరులు. ఒక లవర్ బాయ్ స్టోరీకి మహాభారతంలో భీష్మ పితామహుడు వంటి ఒక యోధుడి పేరుని టైటిల్ గా పెట్టడంలో అర్థమేంటి? ఇది కచ్చితంగా హిందువులను కించపరచడమే వారి మనోభావాలను దెబ్బతీయడమేనని వారు వాదిస్తున్నారు.

సినిమా టైటిల్ మార్చకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. స్క్రీనింగ్ ను ఆపివేస్తామని వారు అంటున్నారు. మరి భీష్మ టైటిల్ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

లాక్ డౌన్ ఎత్తివేతకు 7 కమిటీలతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ...

‘సమంత’ ఏమంత అందగత్తె కాదు.. బుట్టబొమ్మకు షాకిచ్చిన హ్యాకర్లు

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ కు గురయ్యింది. టెక్నికల్ టీం సాయంతో మరలా ఆ అకౌంట్ ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని అర్ధరాత్రి 12.37 గంటలకు ట్విటర్ వేదికగా నెటిజన్లకు...

ఆ వైసీపీ ఎమ్మెల్సీలపై వేటు ఖాయమా?

కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఒకరిపై విమర్శలు, ఆరోపణలు షరా మామూలుగానే...

‘కరోనా’ కేవలం ప్రారంభం మాత్రమే.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ నేపధ్యంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ నిన్న ఆ చిత్రానికి సంబంధించిన...

ఒక ప్రియురాలిని చంపి మరో ప్రియురాలితో పారిపోయాడు

అక్రమ సంబంధాలు హత్యలకు దారి తీస్తాయని ఎంత మంది ఎన్ని రకాలుగా హెచ్చరించినా కూడా జనాలు మాత్రం అక్రమ సంబంధాలను వదిలి పెట్టడం లేదు. ఎన్నో రకాలుగా అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు...