Switch to English

జనసేనాని నయా రాజకీయం.. ఇప్పుడే మొదలైంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఐదేళ్ళు, పదేళ్ళు కాదు.. పాతికేళ్ళ రాజకీయ ప్రస్థానానికి ముందే సిద్ధమయి జనసేన పార్టీని స్థాపించినట్లు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ పదే పదే చెబుతూ వస్తున్న విషయం విదితమే. అయితే, ఏదీ ఆ రాజకీయ వ్యూహం.? సుదీర్ఘ కాలం రాజకీయాల్లో వుండాలనుకున్నప్పుడు, అందుకు తగ్గ ప్రణాళిక వుండాలి కదా.! పవన్‌ కళ్యాణ్‌ అంటేనే పవర్‌.. కానీ, ఆ ‘పవర్‌’ రాజకీయాల్లో ఆయనెందుకు చూపించలేకపోతున్నారు.? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీలతో కలిసి పనిచేసిన జనసేన, ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ, 2019కి వచ్చేసరికి జనసేన ఎన్నికల్లో పోటీ చేసింది. ఏం లాభం.? ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుని గెలుచుకుంది. పార్టీ అధినేత రెండు చోట్లా ఓడిపోయారు. అయితే, ఆ ఓటమిని జీర్ణించుకోవడానికి తనకు పెద్దగా సమయం పట్టలేదంటారు జనసేనాని.

ఇదిలా వుంటే, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కొత్త తరహా రాజకీయానికి శ్రీకారం చుట్టారంటూ జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం అనేది అత్యంత వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమట. అది కూడా, వరుసగా మూడు సినిమాల్ని అనౌన్స్‌ చేయడమంటే చిన్న విషయం కాదు కదా.!

ఇటు సినిమాలు, అటు రాజకీయాల్ని ఎలా మేనేజ్‌ చేస్తారు.? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ‘అన్నీ ఆలోచించే పవన్‌ నిర్ణయం తీసుకున్నారు.. పాతికేళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఇది కూడా ఓ వ్యూహాత్మక ఎత్తుగడే’ సినీ పరిశ్రమలో పవన్‌ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితులైన కొందరు అభిప్రాయపడుతున్నారట.

సినిమాకీ సినిమాకీ మధ్య గ్యాప్‌లో జనసేనాని, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో రాజకీయ పర్యటనలు చేస్తారనీ, మరోపక్క తెలంగాణలోనూ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయనున్నారనీ జనసేన వర్గాలంటున్నాయి. కింది స్థాయి నుంచీ పార్టీ బలోపేతం, అదే సమయంలో అభిమాన సంఘాల్లో కీలక మార్పులు, చేర్పులు.. ఇవన్నీ తెరవెనుకాల చకచకా జరిగిపోతున్నాయనీ, ఆ వ్యవహారాల్ని నాగబాబు పర్యవేక్షిస్తున్నారనీ తెలుస్తోంది.

పార్టీ తరఫున మీడియా ముందు గట్టిగా మాట్లాడే ఓ విభాగం త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతోందట. ‘పార్టీ అంటే జనసేనాని ఒక్కరే కాదు..’ అనేలా ఆ టీమ్ పనిచేస్తుందట. జూన్‌ నాటికే జనసేన పార్టీ కొత్త రాజకీయం చూడబోతున్నారని జనసేన పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...