Switch to English

‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

నటీనటులు: శ్రీ సింహా కోడూరి, సత్య, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ..
నిర్మాత: చిరంజీవి, హేమలత
దర్శకత్వం: రితేష్ రానా
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
మ్యూజిక్: కాల భైరవ
ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2019

ఎంఎం కీరవాణి అబ్బాయిల్లో ఒకరైన శ్రీ సింహా హీరోగా, మరొకరు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి చెర్రీ నిర్మాతగా, రితేష్ రానా అనే నూతన డైరెక్టర్ ని పరిచయం చేస్తూ తక్కువ బడ్జెట్ తో భారీ ఫిల్మ్ అనిపించేలా చేసిన సినిమా ‘మత్తు వదలరా’. ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ చూసి బాగుంది అని సపోర్ట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మత్తు వదలరా సినిమా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి మత్తు వదిలించి అదిరిపోయే థ్రిల్స్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ: 

బాబు(శ్రీ సింహా), అభి (నరేష్ అగస్త్య), ఏసుదాస్(సత్య)లు ఫ్రెండ్స్ అండ్ వారి దరిద్రం వలన ఒక చిన్న రూంలో ఉంటారు. బాబు – ఏసుదాస్ కొరియర్ డెలివరీ బాయ్స్ గా జాబ్ చేస్తుంటారు. బాబు ఆ జాబ్ మానేద్దామనుకున్న టైంలో ఏసుదాసు చెప్పిన ఐడియా విని, మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుతాడు. రీ జాయినింగ్ మొదటి రోజు ఏసుదాస్ చెప్పిన ఐడియా ఫాలో అవుతూ అనుకోకుండా సమస్యలో ఇరుక్కుంటాడు.? దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అనుకుంటున్న టైంలో ఇంకో మిస్టరీ కేసులో ఇరుక్కుంటాడు. అనుకోకుండా తన ఫ్రెండ్స్ కూడా ఈ మిస్టరీ కేసులోకి వస్తారు. ఇక అక్కడి నుంచి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎలా ఆ మిస్టరీని చేధించారు? అసలు ఎలా బాబు ఆ సమస్యలో ఇరుక్కున్నాడు? బాబు లైఫ్ ని ఇలాంటి చిక్కుల్లో పడేలా చేసిన ఏసుదాస్ ఐడియా ఏంటి? ఫైనల్ గా ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? అసలు ఆ మిస్టరీ కేసు ఎవరిది? ఎవరు సాల్వ్ చేశారు? అనేదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ముందుగా తెరపై కనిపించి ఈ సినిమాని నడిపించిన నూతన నటీనటుల విషయానికి వస్తే, శ్రీ సింహా డీసెంట్ గా చేసాడని చెప్పాలి, కానీ నటుడిగా చాలా బెటర్ అవ్వాల్సి ఉంది. నరేష్ అగస్త్య లుక్స్ అండ్ పెర్ఫార్మన్స్ అదిరింది, ముఖ్యంగా ఒక్క ప్రీ క్లైమాక్స్ సీన్ లో అదరగొట్టాడు. అలాగే కీ లేడీ రోల్ చేసిన అతుల్య చంద్ర సెకండాఫ్ లో రఫ్ అండ్ టఫ్ పాత్రలో కిరాక్ అనిపించింది. ఇక రీ ఇంట్రడక్షన్ ఇచ్చిన సత్య తనదైన శైలిలో ప్రేక్షకులని నవ్వించాడు. తన వన్ లైనర్స్ బాగానే పేలాయి. ఇక సీనియర్ నటులైన వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖ, పావలా శ్యామల తదితరులు తమ డీసెంట్ పెర్ఫార్మన్స్ తో సినిమాకి హెల్ప్ అయ్యారు.

ఇక సినిమా పరంగా ది బెస్ట్ అనిపించుకునే సీన్స్ విషయానికి వస్తే.. సినిమా ప్రారంభం చాలా బాగుంది. మొదటి 20 నిమిషాలు పాత్రలతో బాగా కనెక్ట్ చేశారు. అలాగే ఆ 20 నిమిషాల్లో వచ్చే సీన్స్, సత్య శ్రీ సింహాకి ఐడియా ఇచ్చే సీన్ బాగున్నాయి.  ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్బ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ సీన్ బాగుంది. మధ్య మధ్యలో సత్య వన్ లైన్స్ నవ్విస్తాయి. అలాగే ఫన్ కోసం రాసుకున్న సెపరేట్ రోహిణి సీరియల్ ట్రాక్ బాగా నవ్విస్తుంది. అలాగే చిరు సినిమాలలోని షాట్స్ ని ఎలివేషన్స్ కోసం వాడుకున్న విధానం మస్త్ అనిపిస్తే, బాలయ్య ట్రాక్ ని ఫన్ కోసం వాడుకున్నారు.

ఆఫ్ స్క్రీన్:  

సినిమా బోరింగ్ గా సాగుతున్నా నలుగురు మాత్రం టెక్నికల్ గా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. షాట్ మేకింగ్ లో ప్రయోగం చేశారనే చెప్పాలి. దాంతో విజువల్స్ చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తాయి. అలాగే కల భైరవ మ్యూజిక్ కూడా సూపర్బ్. ముఖ్యంగా గుడ్లగూబ సౌండ్ ని చాలా మెయిన్ సీన్స్ లో వాడుకున్న విధానం అదిరింది. ఇక ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. అలాగే కార్తీక శ్రీనివాస్ చేసిన ఎడిట్ కట్స్ అండ్ టెక్నిక్స్ అదుర్స్ అంతే.. ఈ మూడు డిపార్ట్మెంట్స్ చాలా ఇంటరెస్ట్ ని క్రియేట్ చేశారు. డైలాగ్స్ కూడా బాగున్నాయని చెప్పుకోవచ్చు. స్పెషల్ గా సత్య ట్రాక్ డైలాగ్స్ బాగున్నాయి. స్టోరీలో అండర్ లైన్ గా మనిషిలోని అవసరం – స్వార్ధం గురించి చెప్పిన పాయింట్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సినిమాని ఎంత ఎంగేజింగ్ గా మొదలు పెట్టారో, అంతే ఆసక్తిగా నడిపించలేదు. మేకింగ్ లో టెక్నీక్స్ బాగున్నా కంటెంట్ అంట బెటర్ లేకపోవడం వలన ప్రీ ఇంటర్వల్ వరకూ బోర్ కొడుతోంది. అక్కడ సత్య వన్ లైనర్స్ పేలినా టైటిల్ సీన్ మాత్రం స్లోగా సాగదీసినట్టు ఉంటుంది. ఇక సెకండాఫ్ మొదలవ్వగానే ట్విస్ట్ రివీల్ చేసి కాసేపు బోర్కొట్టించాడు . ఆ తర్వాత సినిమాలో వచ్చే మేజర్ 2 ట్విస్ట్ లు తప్ప మిగతా అన్నీ మీరు ఈజీగా ఊహించేయగలిగినవే. అందుకే సినిమా అక్కడక్కడా మత్తు వదిలించకుండా మత్తులోకి తీసుకెళ్తుంది. ఇకపోతే క్లైమాక్స్ మరో బిగ్గెస్ట్ మైనస్ సినిమాకి.. మంచి హై ఇచ్చే సీన్ తర్వాత వచ్చే క్లైమాక్స్ బోరింగ్ గా సాగడమే కాకుండా అప్పటి వరకూ వచ్చిన ఫీల్ ని పోగొడుతుంది.

ఆఫ్ స్క్రీన్: 

అండర్ లైన్ గా చెప్పిన పాయింట్ బాగున్నా పూర్తి కథగా ఇంకా బెటర్ గా రాసుకోవాల్సింది. అలాగే ఇలాంటి కథల్ని మనం ఇప్పటికే కొన్ని సింపుల్ థ్రిల్లర్ సినిమాల్లో చూసేసి ఉండడం, అలాగే ట్విస్ట్ లు పెద్దగా లేకపోవడంతో కథ పెద్దగా కనెక్ట్ అవ్వదు. అలాంటప్పుడు స్క్రీన్ ప్లేలో అయినా ఇంకొంచం కేర్ తీసుకొని అబ్బా అనే ట్విస్ట్ లు ఇంకో రెండు రాసుకోవాల్సింది. అలాగే బోరింగ్ సీన్స్ ని ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ గా టెక్నికల్ గా  సూపర్బ్ గా చేసాడు, బెటర్ కథ రాసుకుంటే మంచి సినిమా తీయగలడు అనే నమ్మకాన్ని అయితే రితేష్ రానా సంపాదించుకున్నాడు. కానీ ఆడియన్స్ ని కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టడంలో మాత్రం 50% మాత్రమే సక్సెస్ అయ్యాడు. కానీ మేకింగ్ పరంగా, ప్లే పరంగా కొన్ని విషయాలను వాడుకున్న విధానంలో మాత్రం బెస్ట్ అనిపించుకున్నాడు. ఎడిటర్ టెక్నిక్స్ అదుర్స్ కానీ ఓవరాల్ లెగ్థ్ విషయంలో మాత్రం ఇంకా బెటర్ అండ్ షార్ప్ కట్ చేసుండాల్సింది. సిజి వర్క్ ఏం బాలేదు. అది వాళ్ళకీ అర్థమైనట్టు ఉందనుకుంటా, చాలా సేపు సిజి ఎపిసోడ్ చేసినప్పటికీ సినిమాలో చాలా అంటే చాలా తక్కువ పెట్టారు.

విశ్లేషణ: 

ఎంఎం కీరవాణి అబ్బాయిలైన శ్రీ సింహా, కాల భైరవ లాంటి వారు పరిచయం అవుతూ, కొత్త డైరెక్టర్ రితేష్ రానా తో చేసిన ‘మత్తు వదలరా’ సినిమా ఎలా ఉంది అంటే, టెక్నికల్ గా ఎలా అదరగొట్టచ్చు అనే విషయంలో చాలా మంది మేకర్స్ కి మత్తు వదిలించేలా ఉంది, కానీ సినిమా పరంగా మాత్రం మత్తు వదలగొట్టే రేంజ్ థ్రిల్లర్ అయితే కాదు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి అనే కాంపౌండ్ నుంచి వచ్చిన మూవీ, ఆయన హస్తం ఎక్కడన్నా ఉందేమో అనే అంచనాలతో సినిమా చూసినా మీరు డిజప్పాయింట్ అవుతారు. థ్రిల్స్ లో హై ఇచ్చే మూమెంట్స్ లేకపోయినా పర్లేదు,  50% ఒక మాదిరిగా నవ్వుకునే ఫన్, డీసెంట్ థ్రిల్స్ ఒకట్రెండు ఉంటే చాలు అనుకునే వారు ఈ సినిమాని హ్యాపీ గా చూడచ్చు.

ఫైనల్ పంచ్: మత్తు వదలరా – యావరేజ్ థ్రిల్స్ కానీ గ్రేట్ టెక్నికల్ ఫిల్మ్.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 2.5/5  

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...
నటీనటులు: శ్రీ సింహా కోడూరి, సత్య, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ.. నిర్మాత: చిరంజీవి, హేమలత దర్శకత్వం: రితేష్ రానా సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం మ్యూజిక్: కాల భైరవ ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్ విడుదల తేదీ: డిసెంబర్ 25, 2019 ఎంఎం కీరవాణి అబ్బాయిల్లో ఒకరైన శ్రీ సింహా హీరోగా, మరొకరు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి చెర్రీ నిర్మాతగా, రితేష్ రానా అనే నూతన డైరెక్టర్ ని...'మత్తు వదలరా' మూవీ రివ్యూ