Switch to English

చెవిరెడ్డీ.. చీవాట్లు గట్టిగానే పడ్డాయటగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోషల్‌ మీడియా పేజ్‌లో, సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవికి వ్యతిరేకంగా పోస్టింగ్‌ పడింది. దాంతో, మెగా ఫ్యాన్స్‌ తమ సత్తా చూపించేశారు. అప్పుడెప్పుడో వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్ట్‌ అయినప్పుడు, ‘చట్టం తన పని తాను చేసింది..’ అని మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వ్యాఖ్యానించడాన్ని ఇప్పుడు చెవిరెడ్డి ప్రస్తావిస్తూ, ‘తండ్రీ కొడుకులు జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం పడిగాపులు పడ్డారు.. ఓడలు బండ్లు అవడం అంటే ఇదే..’ అని సెలవిచ్చారు.

ఎలాగైతేనేం, మెగా ఫ్యాన్స్‌ దెబ్బకి చెవిరెడ్డి మాట మార్చేశారు. తనకు ఎలాంటి సోషల్‌ మీడియా అకౌంట్స్‌ లేవనీ, తాను చిరంజీవికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్‌ చేయలేదని సెలవిచ్చారు. అవునా.? అలాగైతే, ‘చెవిరెడ్డి టీమ్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో ‘అఫీషియల్‌’ పేజ్‌ నడుపుతున్నదెవరు.? ఈ ప్రశ్నకు చెవిరెడ్డి దగ్గర సమాధానం లేదు. మరోపక్క, చెవిరెడ్డి వ్యవహారంపై పార్టీలో తీవ్రమైన చర్చ జరిగగిందనీ, వ్యవహారం అధినేత వైఎస్‌ జగన్‌ వద్దకు వెళ్ళిందనీ, ‘సైరా నరసింహారెడ్డి’ పబ్లిసిటీ కోసం చాలా కష్టపడ్డామనీ, చెవిరెడ్డి మొత్త వ్యవహారాన్ని నాశనం చేసేశారనీ ఈ వ్యవహారంపై జగన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చెవిరెడ్డికి చీవాట్లు పడ్డాయనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. జగన్‌ ఆదేశంతోనే, చెవిరెడ్డి వివరణ ఇచ్చారట. ‘

చిరంజీవితో సన్నిహిత సంబంధాలే వున్నాయి.. నేను జగన్‌ మనిషిని..’ అంటూ చెవిరెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ ఇప్పటికీ నిందితుడే. ఆయన బెయిల్‌ మీదనే వున్నారు. ఆయనే కాదు, విజయసాయిరెడ్డిది కూడా ఇదే పరిస్థితి. ‘వ్యక్తిగత హాజరు మినహాయింపు..’ కోరుతూ న్యాయస్థానానికి ఇటీవలే వైఎస్‌ జగన్‌ మొరపెట్టుకున్న విషయం విదితమే. అలాంటప్పుడు, అప్పట్లో చరణ్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది.? చెవిరెడ్డి మాట జారిన మాట వాస్తవం.. ఆయనకు చీవాట్లు పడటం కూడా వాస్తవమే అయి వుండొచ్చు. లేకపోతే, ఇంతలోనే అంత మార్పు ఎలా సాధ్యం.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...