Switch to English

‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ & రేటింగ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow
నటీనటులు:వరుణ్ తేజ్, పూజ హెగ్డే, అథర్వ, మిర్నాలిని రవి, బ్రహ్మాజీ తదితరులు.

సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్‌: చోట కె ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయాంక బోస్
దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాణం: 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: రామ్ ఆచంట – గోపి ఆచంట

ఈ ఏడాది వెంకటేష్ తో కలిసి సంక్రాంతి బరిలో ‘F2’ అంటూ దిగి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇప్పటి వరకూ కూల్ గా, క్లాస్ గా, లవర్ బాయ్ గా చేసిన పాత్రలన్నిటినీ పక్కన పెట్టి నెగటివ్ షేడ్స్ లో, కంప్లీట్ మాస్ అవతార్ లో చేసిన సినిమా ‘గద్దల కొండ గణేష్(వాల్మీకి)’. మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘జిగర్తాండ’ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా నేడు భయారీ అంచనాల నడుమ విడుదలైంది. మరి ఆ అంచనాలను అందుకొని వరుణ్ తేజ్ కి మాస్ ఇమేజ్ ని తెచ్చి పెట్టిందా? లేదా? తమిళ్లో లానే ఇక్కడా బంపర్ హిట్ అయ్యిందా? లేదా?  వాటికి సమాధానమే ఈ రివ్యూ.

కథలోకి వెళితే

అభి(అథర్వ మురళి), సినిమా ప్రపంచంలో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలగాలని అవకాశాల కోసం తిరిగే ఒక అసిస్టెంట్ డైరెక్టర్. తాను పనిచేస్తున్న డైరెక్టర్ తనని అవమానించడంతో ఒక్క ఏడాదిలో సినిమా తీస్తానని ఛాలెంజ్ చేసాడు. అప్పుడే తన షార్ట్ ఫిల్మ్ చూసి నిర్మాత రఘుబాబు సినిమా ఆఫర్ ఇస్తాడు. కానీ అభి నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో సినిమా చేస్తానని చెప్పి ఓ రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ స్టోరీ రాయాలని డిసైడ్ అయ్యి అలాంటి గ్యాంగ్ స్టర్ కోసం వెతుకుతున్న టైములో అభి గద్దల కొండ గణేష్(వరుణ్ తేజ్) అనే గ్యాంగ్ స్టర్ గురించి తెలుసుకుంటాడు. కొన్ని విషయాలు బాగా నచ్చి తన కథే పూర్తిగా తీసుకొని తన మీదే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యి తన ఫ్రెండ్ సత్యతో కలిసి గణేష్ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఈ విషయం గద్దల కొండ గణేష్ కి తెలియడంతో మొదట చంపేయాలనుకున్నా, ఆ తర్వాత కన్విన్స్ అయ్యి తననే పెట్టి తన సినిమా తీయమంటాడు. ఇక అక్కడి నుంచి గద్దల కొండా గణేష్ తో అభి సినిమా తీయడానికి పడ్డ కష్టాలేంటి? అసలు అభికి గణేష్ లైఫ్ లో అంతగా ఆకట్టుకున్న అంశాలేంటి? అసలు గణేష్ గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు గ్యాంగ్ స్టర్ అయినా గణేష్ ని అభి ఎలా నటుడిగా మార్చాడు? మార్చిది సినిమా తీసి సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే ‘గద్దల కొండ గణేష్’ కథ.

తెరమీద ఎవరెలా చేసారు

వాల్మీకి గా మొదలై గద్దల కొండ గణేష్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి వరుణ్ తేజ్ నటన బిగ్గెస్ట్ హైలైట్. సినిమా భాషలో చెప్పాలంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి 3 కచ్చితంగా ఉండాలంటారు, అవి ‘కథ, కథ, కథ’. అలాగే ఈ సినిమా విజయానికి కారణం “వరుణ్ తేజ్ వరుణ్ తేజ్, వరుణ్ తేజ్. వరుణ్ తేజ్” కెరీర్లోనే మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. తన నటన, స్టైలిష్ మాస్ లుక్, డైలాగ్ డిక్షన్, మ్యానరిజమ్స్ అన్నీ కలిపి సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకూ ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ని తుడిచేసి, 200% మాస్ హీరో ఇమేజ్ వరుణ్ తేజ్ కి ఈ సినిమాతో వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వరుణ్ తేజ్ కాకూండా గద్దల కొండ గణేష్ పాత్ర ఇంకెవరూ చేయలేరు అనే రేంజ్ లో పాత్రలో జీవించాడు.
ఇక ఫ్లాష్ బాక్ లో కనిపించే పూజ హెగ్డే 80-90ల లుక్ లో క్యూట్ గా, లవ్లీగా కనిపించి ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ – పూజ హెగ్డే సీన్స్ బాగుండడమే కాకుండా వీరి కెమిస్ట్రీ కూడా అదిరింది. ఈ సినిమాకి సెకండ్ హీరో – హీరోయిన్ అయినా అథర్వ మురళి – మిర్నాలిని రవిల నటన మరియు ఫస్ట్ హాఫ్ లో వచ్చే వాళ్ళ లవ్ ట్రాక్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. యాక్టింగ్ టీచర్ గా బ్రహ్మాజీ రోల్ సెకండాఫ్ లో హైలైట్ అవుతుంది. తాను ఉన్నంత సేపు బాగా నవ్విస్తాడు. అలాగే కమెడియన్ సత్య కామెడీ కూడా ఫస్ట్ హాల్ఫ్ లో బాగా వర్కౌట్ అయ్యింది. రావు రమేష్, తనికెళ్ళ భరణి, రఘు బాబు, సుప్రియ పథక్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు.

తెరవెనుక ఎవరెలా చేశారు..

హరీష్ శంకర్ అనుకున్న కథకి వరుణ్ తేజ్ ఎలా అయితే 200% న్యాయం చేసాడో అలానే మరో ఇద్దరు టెక్నీకల్ పర్సన్స్ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళే సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్. హరీష్ శంకర్ విజువల్ గా ఊహించన దానికంటే రెండు మూడు రెట్లు బెటర్ విజువల్స్ ఇచ్చాడు. ఏ ఫ్రేమ్ లో కూడా మనం కథ నుంచి పక్కకెళ్ళకుండా ఉండేలా విజువల్స్ చేసాడు. దీనికి మించి మిక్కీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు. ఈ సినిమాలో కథా పరంగా ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. ప్రతి సీన్ లో ప్రతి షాట్ కి తగ్గట్టు మ్యూజిక్ చేయడం చాలా కష్టతరం. కానీ మనసు పెడితే సాధ్యమే అని మిక్కీ ప్రూవ్ చేసాడు. వరుణ్ లానే ఛాన్స్ ఇస్తే మాస్ మాసాలా సినిమాలకి అదిరిపోయేలా మ్యూజిక్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. తన సెట్స్ ఆ విలేజ్ రౌడీయిజంని పర్ఫెక్ట్ గా చూపడానికి హెల్ప్ అయ్యింది. చోట కె ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ వరకూ ఎలాంటి డ్రాప్ లేదు. కానీ సెకండాఫ్ లో మాత్రం చాలా చోట్ల సాగదీసి సాగదీసి వదిలారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ దగ్గర ఇంకా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పుంటే ఆడియన్స్ క్లైమాక్స్ లో ఇంకాస్త బెటర్ గా ఫీల్ అయ్యుండేవారు. వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్, గౌరి నాయుడు కాస్ట్యూమ్ కథకి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
ఇక సినిమాకి కెప్టెన్ అయినా హరీష్ శంకర్ విషయానికి వస్తే, రీమేక్ కథని అద్భుతంగా తీస్తాడని ఆల్రెడీ గబ్బర్ సింగ్ తో ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో పోల్చుకుంటే ఈ సినిమా ఒక 20% తక్కువ ఇంపాక్ట్ ఉండేలా తీసాడని చెప్పాలి. కథ పరంగా సింపుల్ కంటెంట్ కానీ స్క్రీన్ ప్లే పరంగా నడిచే సినిమా ఇది. హరీష్ శంకర్ అనగానే ఫస్ట్ హాఫ్ ది బెస్ట్ గా చేస్తాడు. అలానే గద్దల కొండ గణేష్ ఫస్ట్ హాఫ్ కూడా అదిరిపోయింది, ఎప్పటిలానే సెకండాఫ్ కి వచ్చేసరికి, అసలు కథలోకి వెళ్లే కొద్దీ స్పీడ్, ఎంటర్టైన్మెంట్ తగ్గడం మొదలవుతాయి. ముఖ్యంగా కథకి కీలకమైన ఎమోషనల్ కంటెంట్ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ఒరిజినల్ కథలో లేకుండా ఇక్కడ యాడ్ చేసిన వరుణ్ – పూజ ప్రేమ కథలో ఎమోషనల్ కంటెంట్ చాలా రెగ్యులర్ గా ఉంటుంది. అందుకే  సెకండాఫ్ కొంతమేర నిరుత్సాహపరుస్తుంది. అలాగే సుమారు 3 గంటల నిడివిలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే సెకండాఫ్ బెటర్ అనిపించేది. ఎప్పటిలానే తన హీరోయిజం ఎలివేషన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ విషయంలో సూపర్బ్ అనిపించుకున్నాడు. 14రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా తీశారు. వారు పెట్టిన ప్రతి రూపాయి తెరపై చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది.

ది బెస్ట్ సీన్స్:

– హీరో ఇంట్రడక్షన్ సీన్ : విజువల్ – పెర్ఫార్మన్స్ – డైలాగ్స్  పరంగా అరాచకం.
– ఎమ్మెల్యే సెలక్షన్ టైంలో వచ్చే వరుణ్ తేజ్ సీన్
– అథర్వ – మిర్నాలిని రవి లవ్ ట్రాక్
– వరుణ్ తేజ్ కౌంటర్ అటాక్ చేసే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్
– వరుణ్ తేజ్ – పూజ హెగ్డే లవ్ సీన్స్
– అదుర్స్ అనిపించే 4 పాటల పిక్చరైజేషన్

సీటీమార్ పాయింట్స్

– వరుణ్ తేజ్ మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్
– బ్రహ్మాజీ కామెడీ ఎపిసోడ్
– మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– అయాంక బోస్ విజువల్స్
– ఫస్ట్ హాఫ్
– హరీష్ శంకర్ డైలాగ్స్

బోరింగ్ పాయింట్స్

– సాగదీసిన సెకండాఫ్
– అంతగా మెప్పించని ఎమోషనల్ కంటెంట్
– 3 గంటల నిడివి

విశ్లేషణ

‘గద్దల కొండ గణేష్’గా టైటిల్ మార్చబడిన ‘వాల్మీకి’ సినిమా ఎలా ఉంది అంటే ‘బంతోయ్ భోజనం పెట్టి అందులో స్వీట్ లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే.. ఇందులో వరుణ్ అదిరిపోయే పెర్ఫార్మన్స్, మాస్ ఎంజాయ్ చేసే హీరోయిజం ఎలివేషన్ సీన్స్, బ్యూటిఫుల్ లవ్ ట్రాక్స్, కావలసినంత కామెడీ ఇలా అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ప్రేక్షకుల మనసుకి హత్తుకోవాలంటే వీటన్నిటినీ కనెక్ట్ చేసే ఎమోషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, అది లేకపోతే ఎన్ని ఉన్నా వృధా ప్రయత్నం అనిపిస్తుంది. ఇక్కడ ఎమోషన్ కంటెంట్ ఓకే ఓకే అనేలా ఉండడం వల్ల ప్రేక్షకులు చివర్లో ఒకింత నిరుత్సాహంతో బయటకి వస్తారు. ఫైనల్ గా వరుణ్ తేజ్ కి గత్తరలేపినవ్, చించేసినవ్ పో అనే రేంజ్ లో మాస్ ఇమేజ్ తెచ్చి పెడుతుంది. అలాగే దీపావళి ముందు దసరా పండగలా మెగా ఫాన్స్ కి ‘సైరా నరసింహారెడ్డి’ అనే బ్లాక్ బస్టర్ ముందు సూపర్ హిట్ ఈ ‘గద్దల కొండ గణేష్’ అని చెప్పాలి. కామన్ ఆడియన్స్ మాత్రం ఒకసారి హ్యాపీగా చూడవచ్చు.

ఫైనల్ పంచ్: ‘గద్దల కొండ గణేష్’ గా వరుణ్ తేజ్ – అద్భుతః అద్భుతస్య అద్భుతోభ్యహ 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...
నటీనటులు:వరుణ్ తేజ్, పూజ హెగ్డే, అథర్వ, మిర్నాలిని రవి, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం: మిక్కీ జె మేయర్ ఎడిటర్‌: చోట కె ప్రసాద్ సినిమాటోగ్రఫీ: అయాంక బోస్ దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్ నిర్మాణం: 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు: రామ్ ఆచంట - గోపి ఆచంట ఈ ఏడాది వెంకటేష్ తో కలిసి సంక్రాంతి బరిలో 'F2' అంటూ దిగి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇప్పటి వరకూ కూల్...'గద్దలకొండ గణేష్' మూవీ రివ్యూ & రేటింగ్