Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 16 డిసెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం

సూర్యోదయం: ఉ.6:26
సూర్యాస్తమయం: సా.5:23 ని.లకు
తిథి: మార్గశిర శుద్ధ చవితి రా.11:00 ని.వరకు తదుపరి మార్గశిర శుద్ధ పంచమి
సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం)
నక్షత్రము: ఉత్తరాషాడ ఉ.9:30 వరకు తదుపరి శ్రవణం
యోగం: ధృవం ఉ.10:31ని. వరకు తదుపరి వ్యాఘాతం
కరణం: వనిజ మ.12:02 ని. వరకు తదుపరి బవ
దుర్ముహూర్తం : సూర్యోదయం నుండి ఉ.7:53 ని.వరకు
వర్జ్యం : మ.1:15 ని నుండి 2:46 ని‌ వరకు
రాహుకాలం: ఉ.9:00 గం. నుండి మ.10:30 ని.వరకు
యమగండం: మ.1:30 గం నుండి 3:00 ని .వరకు
గుళికా కాలం: ఉ.6:42 ని నుండి 8:04 ని.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:05 ని.నుండి 5:54 ని.వరకు
అమృతఘడియలు: రా.10:17 ని‌ నుండి 11:48 వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:49 నుండి మ.12:33 వరకు

ఈరోజు (16-12-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

వృషభం: ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.

కర్కాటకం: చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.

సింహం: సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది.

కన్య: వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

తుల: ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

వృశ్చికం: ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు.

ధనస్సు: భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.

మకరం: ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.

కుంభం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మీనం: కొన్ని పనులలో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...