Switch to English

ఎలుక సాయంతో మనిషి జీవిత కాలాన్ని పెంచుకోవచ్చిలా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎలుక.! అమ్మో భయం.! కానీ, ఈ ఎలుకనీ దేవుడిగా పూజిస్తాం మనం.! ఔను, మహా గణపతికి వాహనం ఎలుకే కదా.!

అసలు విషయంలోకి వస్తే, మనిషి జీవిత కాలాన్ని పెంచడానికి ఎన్నో ఏళ్ళుగా పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. ఒకప్పుడు వందేళ్ళు.. ఆ పైన.. మనుషులు జీవించేవారు. అది కూడా, ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకుండా.

కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. వందేళ్ళు బతకడం అనేది ఓ పెద్ద టాస్క్. అది కూడా, నానా రకాల మందులు, శస్త్ర చికిత్సలు.. ఇలాంటి వాటి సాయంతో ఎలాగోలా ఓ డెబ్భయ్, ఎనభై ఏళ్ళు బతికేస్తున్నాం. అదృష్టం కలిసొస్తే ఇంకో పదేళ్ళు అదనంగా బతుకుతున్నాం.!

అయితే, ఇకపై ఇంకాస్త ఎక్కువ కాలం జీవించడానికి మార్గం సుగమం కాబోతోంది. అది కూడా ఓ ఎలుక సాయంతో.! ఎలుక అంటే, కేవలం ఎలుక కాదు.! అందులో చాలా జాతులున్నాయ్. ఇంట్లో కనిపించే చిట్టెలుక, సాధారణ ఎలుకలే కాదు.. పంది కొక్కుల్లాంటివి కూడా వుంటాయ్.

అలాగే, నేక్‌డ్ మోల్ ర్యాట్ అనే ఎలుక ఒకటి వుంది. అంతరించిపోతున్న జీవుల్లో ఇది కూడా ఒకటి.! అత్యంత వేగంగా అంతరించిపోతోందిది.! దీన్ని ప్రత్యేకంగా సంరక్షించే చర్చలూ చేపట్టారు. ఎందుకంటే, ఇది మనిషి జీవిత కాలాన్ని పెంచబోతోందిట. ఆఫ్రికా దేశాల్లో అరుదుగా కనిపిస్తుందిది. దీన్ని స్యాండ్ పప్పీ అని కూడా అంటారు.

ఈ సాండ్ పప్పీ లేదా నేక్‌డ్ మోల్ ర్యాట్‌లో ప్రత్యేకమైన జన్యు నిర్మాణం వుంది. ఆ కారణంగా, తన సైజులో వుండే, సాధారణ ఎలుకల కంటే పది రెట్లు ఎక్కువ కాలం జీవిస్తుందిది. క్యాన్సర్ వంటి రోగాలు దీనికి రావు. సాధారణ ఎలుకల్లో కనిపించే చాలా రకాల అనారోగ్య సమస్యలు ఈ సాండ్ పప్పీల్లో కనిపంచవట.

నేక్‌డ్ మోల్ ర్యాట్ లేదా సాండ్ పప్పీలపై పరిశోధనలు చేసిన వెరా గొరుబునోవా అనే బయాలజీ ప్రొఫెసర్, దీంట్లోని ఓ ప్రత్యేక జన్వువుని సాధారణ ఎలుకల్లోకి మార్చడం ద్వారా వాటి జీవిత కాలాన్ని పెంచవచ్చునని అంటున్నారు. ‘హెచ్ఎండబ్ల్యు-హెచ్’ అనే మెకానిజం వల్లనే, ఈ నేక్‌డ్ మోల్ ర్యాట్‌కి ఈ ప్రత్యేకత అట.

తన పరిశోధనల ారాంశాన్ని వెరా గొరుబునోవా మెడికల్ జర్నల్స్‌ ద్వారా ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎలకల మీద ప్రయోగాలు జరుగుతున్నాయనీ, ముందు ముందు మనుషుల మీద కూడా ప్రయోగాలు చేస్తామని అంటున్నారు వెరా గొరుబునోవా. ఓ బృందం ఈ మేరకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది.

క్యాన్సర్ సహా అనేక అనారోగ్య సమస్యల నుంచి మనిషికి ఈ ప్రయోగాల ద్వారా కొంత ఉపశమనం లభించే అవకాశం వుందట. మనిషి ఎక్కువ కాలం జీవించడం, అది కూడా తక్కువ అనారోగ్య సమస్యలతో జీవించడం అనేది తమ ప్రయోగాల్లో అత్యంత ప్రయార్టీతో కూడిన అంశమని వెరా గురుబునోవా బృందం చెబుతోంది.

కాగా, నేక్‌డ్ మోల్ ర్యాట్ నుంచి, ‘హెచ్ఎండబ్ల్యు-హెచ్ఎ’ అనే జీన్‌ని తొలగించి చూస్తే, దాంట్లో కణితులు పెరగడాన్ని వెరా గురుబునోవా మరియు ఆయన సహచరుల బృందం తమ పరిశోధనల్లో గుర్తించింది. అదే సమయంలో, సాధారణ ఎలుకల్లో ఆ జీన్‌ని ప్రవేశపెట్టినప్పుడు, వాటి జీవిత కాలం పెరిగింది.

సాధారణ ఇమ్యూన్ సిస్టమ్ ఈ జీన్ ప్రవేశంతో మరింత పెరిగిన దరిమిలా, ఎలుకలకే కాదు.. మానవులకీ ఈ జీన్ వల్ల ఎంతో ప్రయోజనం వుంటుందని వెరా బృందం పేర్కొంది. ముందు ముందు చేయబోయే ప్రయోగాలు కూడా సఫలమైతే, తక్కువ కాలంలోనే, మనిషికి అత్యద్భుతమైన ఉపశమనం దొరకనుందన్నది ఆ బృందం వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...