Switch to English

రూ.200 అప్పు తీర్చడానికి 5వేల కిలోమీటర్లు వచ్చాడు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఆయన ఓ కిరాణా షాపులో రూ.200 బాకీ ఉన్నాడు. కానీ ఆ అప్పు చెల్లించకుండానే తన దేశం వెళ్లిపోయాడు. 20 ఏళ్లు గడిచిపోయాయి. కాలక్రమంలో తమ దేశంలో ఎంపీ అయ్యాడు. ఎన్నో పనులు, మరెన్నో కార్యక్రమాలు.. అయినా 20 ఏళ్ల క్రితంనాటి రూ.200 అప్పును మరచిపోలేదు. ఆ అప్పు తీర్చడం కోసమే ఏకంగా 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి మరీ ఆ షాపు యజమానుల ఇంటికి వెళ్లాడు. విషయం తెలిసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

కెన్యా ఎంపీగా ఉన్న రిచర్డ్ న్యాగక టోంగీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో కొంతకాలం చదువుకున్నారు. ఆ సమయంలో ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో స్థానిక వ్యాపారి గవాలీకి చెందిన కిరాణా దుకాణంలో నిత్యావసర వస్తువులు అరువుగా తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో ఆయన బాకీ మొత్తం రూ.200కి చేరింది. అయితే, టోంగీ ఆ అప్పు తీర్చకుండానే స్వదేశానికి వెళ్లిపోయారు. ఇది జరిగి 20 ఏళ్లు అయింది.

టోంగీ కెన్యా లో రాజకీయంగా ఎదిగారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన విదేశీ వ్యవహారాల శాఖలో ఓ విభాగానికి వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తాను బకాయి పడ్డ రూ.200 మరిచిపోలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఆయన సతీసమేతంగా ఔరంగాబాద్ వచ్చారు. తాను బకాయి పడ్డ గవాలీ ఇంటికి వెళ్లి, ఆయన కుమారుడికి రూ.200 అప్పు తిరిగి చెల్లించబోయారు. దీంతో వారు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడో 5వేల కిలోమీటర్ల దూరం నుంచి రూ.200 తీర్చడం కోసం ప్రత్యేకంగా వచ్చిన అతిథిని చూసి ఆనందం పట్టలేకపోయారు. ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించి, ఆయనకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. వారి మర్యాదలు చూసి టోంగీ కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు గవాలీ కుటుంబం ఆదుకుందని, వారి అప్పు చెల్లించకుండా తమ దేశం వెళ్లిపోయినప్పటికీ, ఆ సంగతి తాను మరచిపోలేదన్నారు. అది తీర్చడం కోసమే ఇప్పుడు వచ్చానని, వారు తనను ఎంతో ఆప్యాయంగా ఆదరించి చక్కని ఆతిథ్యం ఇచ్చారని, తాను వారిని ఎప్పటికీ మరచిపోలేనని, గవాలీ కుటుంబంతో స్నేహసంబంధాలు కొనసాగిస్తానని చెప్పారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...