సమంత లీడ్ రోల్ లో నటించిన యశోద ప్రోమోలతో ఆకట్టుకుంది. హరి అండ్ హరీష్ ద్వయం రూపొందించిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. మరి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
సరోగేట్ తల్లి అవ్వడానికి ఒప్పుకున్న యశోద (సమంత) సరోగసీలు చేసే ఒక పెద్ద కంపెనీలో చేరుతుంది. అయితే అక్కడ ఉన్న కొన్ని రోజులకే సమంతకు ఏదో తేడా జరుగుతోంది అని అర్ధమవుతుంది. అదేంటో కూడా తెలుసుకుంటుంది. ఇంతకీ అదేంటి?
సమంత అక్కడ జరుగుతున్న అన్యాయాలపై ఏ విధంగా పోరాడింది? చివరికి ఏమైంది అన్నది చిత్ర కథ.
నటీనటులు:
సమంత ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోసిందని చెప్పొచ్చు. సినిమా ఆద్యంతం ప్రేక్షకుడి దృష్టిని తన మీద ఉంచుకోవడంలో సక్సెస్ అయింది. సమంత మంచి పెర్ఫార్మర్ అని ఇప్పటికే మనకు చాలా సార్లు ప్రూవ్ అయింది. అయితే ఈసారి ఫైట్ సీక్వెన్స్ లతో ఆశ్చర్యపరుస్తుంది. మొత్తంగా సామ్ నుండి వచ్చిన బెస్ట్ పెర్ఫార్మన్సెస్ లో ఈ చిత్రం కూడా ఒకటి.
ఇక సహాయపాత్రల్లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, సంపత్ రాజ్, మిగతా సపోర్ట్ కాస్ట్ అంతా కూడా వారి వారి పాత్రల్లో రాణించారు.
సాంకేతిక నిపుణులు:
యశోద కథ చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలోనే హరి అండ్ హరీష్ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ అరగంటకి ప్రేక్షకుడిలో ఆలోచన శక్తిని రేకెత్తిస్తూ తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్సాహం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అయ్యాక సినిమా చాలా ఫ్లాట్ గా మారిపోతుంది.
పులగం చిన్నరాయణ, చల్లా భాగ్య లక్ష్మి అందించిన సంభాషణలు బాగున్నాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికున్న ప్లస్ పాయింట్స్ లో ప్రధానమైంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల చిత్ర ఫీల్ కూడా బాగుంది. ఇక ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరాయి.
నిర్మాతలు సినిమాకు ఏం కావాలో అది చేసారు.
ప్లస్ పాయింట్స్:
- సమంత పెర్ఫార్మన్స్
- స్క్రీన్ ప్లే
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్;
- వరలక్ష్మి బ్యాక్ స్టోరీ
- క్లైమాక్స్
విశ్లేషణ:
యశోద ఒక మంచి థ్రిల్లర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చివర్లో ట్విస్ట్ రివీల్ అయ్యాక సాధారణ చిత్రంగా అనిపిస్తుంది. సమంత సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె కెరీర్ లో ఇది ఒక స్పెషల్ చిత్రం.
717078 227822wonderful issues altogether, you simply received a logo new reader. 620063