Switch to English

వైఎస్సార్ ప్రదేశ్.! ఆ రోజెంతో దూరంలో లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

మారాల్సింది రాజకీయ నాయకులు కాదు.! ప్రజలే మారాలి.! ఆ ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రజాధనంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అధికారంలో వున్న పార్టీలు తమకు నచ్చినవారి పేర్లను ఆయా సంక్షేమ పథకాలకు పెట్టడమేంటి.?

యూనివర్సిటీల పేర్లు సైతం మార్చేస్థాయికి ‘పరిపాలన’ దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వేమన విగ్రహమెందుకు.? వైఎస్సార్ విగ్రహం వుంటేనే పండగ.. అనే స్థాయికి అధికారం తన స్థాయిని దిగజార్చేసుకుంది.

‘ఎవడబ్బ సొమ్మనీ..’ అని అంటాడో మహానుభావుడు. అవును, ఏ పార్టీ అధికారంలో వున్నా.. సంక్షేమ పథకాలు కావొచ్చు, అభివృద్ధి కావొచ్చు.. అవన్నీ జరిగేవి, అమలయ్యేవి ప్రజాధనంతోనే. ఏ రాజకీయ పార్టీ కూడా వేల కోట్లు, లక్షల కోట్లను ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వెచ్చించవు.

మొన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మారింది.. తాజాగా వేమన విగ్రహం స్థానంలోకి వైఎస్సార్ విగ్రహం వచ్చి చేరింది. వాట్ నెక్స్‌ట్.? ఆంధ్రప్రదేశ్ కాస్తా వైఎస్సార్ ప్రదేశ్ అవడమే తరువాయి ఏమో.! జగనన్న కాలనీలట.. ఔను మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత సొమ్ములతో కదా, పేదలకు ఇళ్ళు కట్టిస్తున్నది.?

ఎవరూ ప్రశ్నించకపోతే పరిస్థితి ఇలాగే వుంటుంది. ప్రశ్నించాల్సింది విపక్షాలు కానే కాదు, ప్రజలు మాత్రమే. ‘మా మీద అప్పు చేసి, మా సొమ్ములతో మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. వాటికి మీ పేర్లు పెట్టుకోవడమేంటి.?’ అని పాలకుల్ని ప్రజలు ప్రశ్నించాల్సిందే. అప్పుడే అధికారంలో వున్నవారిని నిలదీసే విపక్షాల పోరాటానికీ ఓ అర్థం వుంటుంది.

అయినా, పేర్లు.. రంగులు.. విగ్రహాలు.. వీటి వల్ల సాధించేదేంటి.? చంద్రబాబు హయాంలో అన్నిటికీ చంద్రన్న పేర్లు పెట్టుకున్నారు.. కొన్నిటికి ఎన్టీయార్ పేర్లు పెట్టుకున్నారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రాగలిగింది.? చంద్రబాబుది మూర్ఖత్వమని నిరూపితమయ్యింది. ప్రస్తుతం వైసీపీ హయాంలో జరుగుతున్నదేమిటి.? ఈ మూర్ఖత్వానికీ సమాధానం చెప్పాల్సింది ప్రజలే.!

అన్నట్టు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని వేమన పద్యాల్ని ప్రస్తావించారు. ‘ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ వినుర వేమ’ అన్నది అందులో ఓ పద్యం. ‘ విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా వుండే వేపాకు కూడా ఔషద రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు.. అంతే కాదు హాని కూడా చేస్తాడు..’ అన్నది ఆ పద్యం తాలూకు అర్థం.

దీంతోపాటు ఇంకో పద్యం కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ‘విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర వున్నంతమాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ వున్నంతమాత్రాన అది రాజహంస అవదు కదా..’ అనే అర్థం వచ్చే వేమన పద్యాన్ని పవన్ పేర్కొన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...