Switch to English

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం కావడంలేదు.

అసలు రాష్ట్రంలోని అధికారం చెలాయిస్తోన్న వైసీపీకి ప్రజస్వామ్యం పట్ల ఇసుమంతైనా అవగాహన వున్నట్లు కనిపించదాయె.! కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా వ్యవహరిస్తాం.. అంటూ వేదికలెక్కి చెప్పడం తప్ప, నిజంగా అలా వ్యవహరిస్తున్నారా వైసీపీలో ఎవరైనా.?

రాజధాని అమరావతిని ‘కమ్మరావతి’ అనడంలోనే, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యంగం పట్ల కనీస గౌరవం వైసీపీకి లేదని తేలిపోయింది. ఆ మధ్య న్యాయస్థానం నుంచి దేవస్థానం.. అంటూ అమరావతి రైతులు పాదయాత్ర చేశారు. అప్పట్లో రైతుల యాత్ర మీద దాడులు జరుగుతాయని పోలీసు శాఖ అత్యుత్సాహంతో కూడిన ప్రకటనలు చేసింది. కానీ, యాత్ర ప్రశాంతంగానే సాగింది కదా.?

ఇప్పుడు కూడా అదే తంతు. తొలుత పోలీసు శాఖ అనుమతివ్వలేదు.. రైతులే కోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నారు. పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్రలో ఎక్కడా రైతులకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంలేదంటే దానర్థమేంటి.? వైసీపీ మంత్రులు, వైసీపీకి చెందిన చాలామంది నేతలు చేస్తోన్న రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని జనం పట్టించుకోవడంలేదనే కదా.?

పశ్చిమగోదావరి జిల్లా దాటి, తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెత్తనివ్వం.. అంటూ అమరావతి రైతులకు ఓ మంత్రి అల్టిమేటం జారీ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారంటే, అది రాష్ట్రం కోసం ఇచ్చారన్న కనీస విజ్ఞత అధికార వైసీపీలో కొరవడింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం రైతులు భూమినిచ్చారు.

ఏ విశాఖలోనో, ఏ కర్నూలులోనో రైతులు ఇలా స్వచ్ఛందంగా భూములు ఇచ్చే పరిస్థితి వుంటుందా.? అలా రాష్ట్ర ప్రజలు ఆలోచించకుండా వుంటారా.? వికేంద్రీకరణ అంటోంది వైసీపీ ప్రభుత్వం. ఆ వికేంద్రీకరణలో కూడా అమరావతి వుంది కదా.? అలాంటప్పుడు, అమరావతిని ‘కమ్మరావతి’ అని ఎలా అంటారన్న డౌటానుమానం చిన్న పిల్లాడికి కూడా వస్తుంది. ఆ మాత్రం సోయ వుంటే వాళ్ళు వైసీపీ నేతలెలా అవుతారు.?

గుడ్డెద్దు చేలో పడ్డట్టు వికేంద్రీకరణ.. అని నినదించడం తప్ప వైసీపీలో ఒక్కరంటే ఒక్కరికి కూడా మూడు రాజధానుల విషయమై ‘సబ్జెక్ట్ లేదు’.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...