కరణ్ జోహార్ టాక్ షో అనగానే ఈ మధ్య బూతులు ఎక్కువ గుర్తొస్తున్నాయి. వచ్చిన సెలబ్రిటీల యొక్క శృంగార జీవితం గురించి పదే పదే అడుగుతూ వారి శృంగార అనుభవాలను పంచుకోవాలంటే కరణ్ జోహార్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. దాంతో కాఫీ విత్ కరణ్ షో కాస్త బూతుల షో అన్నట్లుగా మారి పోయింది. ఉత్తరాది మీడియాతో పాటు దక్షిణాది మీడియా కూడా కరణ్ షో ఒక బూతుల షో అన్నట్లుగా ప్రచారం చేయడంతో ఆయన పద్ధతిలో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ట్రోల్స్ వస్తున్న కారణంగా వచ్చే సీజన్లో బూతులు ఉండబోవు అంటూ అధికారికంగానే ప్రకటించాడు. తాను 7వ సీజన్ లో గెస్ట్ లతో మాట్లాడిన మాటలు కొందరికి ఇబ్బందిగా అనిపిస్తున్నాయని నా దృష్టికి వచ్చింది. కనుక వచ్చే సీజన్ లో అలాంటి పదాలను వాడకుండానే షో నిర్వహిస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు. మరి కరణ్ జోహార్ తన మాటపై నిలబడతాడా లేదా అనేది చూడాలి.
443581 432113educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 551472