Switch to English

సూర్యా భాయ్.. నిన్నిక మోహన్‌లాలే కాపాడాలి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

సూర్య హీరోగా ‘బందోబస్తు’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యతో పాటు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కూడా నటిస్తున్నారు. తమిళంలో ‘కాప్పన్‌’గా రూపొందుతోన్న ఈ సినిమాని తెలుగులో ‘బందోబస్తు’ టైటిల్‌తో విడుదల చేస్తూ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవల్సిందేమంటే, ఈ సినిమా తెలుగు వెర్షన్‌ గురించి.

తెలుగులో ఒకప్పుడు సూర్యకి బీభత్సమైన మార్కెట్‌ ఉండేది. ‘సింగం’ సిరీస్‌ సినిమాలు తెలుగులో మంచి సక్సెస్‌ ఇచ్చాయి సూర్యకి. అంతకు ముందు, ఆ తర్వాత పలు చిత్రాలు తెలుగులో విజయవంతమయ్యాయి. కానీ, ఈ మధ్య విడుదలైన సినిమాల లెక్క తేలిస్తే, వరుసగా సూర్య సినిమాలన్నీ తెలుగులో నిరాశే మిగులుస్తున్నాయి. నిరాశ ఏంటీ.? దారుణమైన ఫ్లాప్స్‌ని చవి చూస్తున్నాయి. దాంతో సూర్య మార్కెట్‌ బాగా తగ్గిపోయింది తెలుగులో.

ఇక తాజా సినిమా విషయానికి వస్తే, టైటిల్‌కి తగ్గట్లుగానే మాంచి బందోబస్తుగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో రూపొందుతోన్న చిత్రమిది. సూర్యతో పాటు, గట్టి పోటీ ఇచ్చే నిండైన విగ్రహంలాంటి మోహన్‌లాల్‌ పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మోహన్‌లాల్‌కి తెలుగులో మార్కెట్‌ బాగానే ఉంది. ‘జనతా గ్యారేజ్‌’ సినిమాతో మోహన్‌లాల్‌ పేరు తెలుగులో మార్మోగిపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన మలయాళ చిత్రం ‘మన్యం పులి’ కూడా తెలుగులో డబ్‌ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత కూడా ఆయన నటించిన ‘కనుపాప’ తదితర చిత్రాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఆ మోహన్‌లాల్‌ ఇప్పుడు సూర్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఎలాగూ సూర్య సినిమాలకు తెలుగులో మార్కెట్‌ డౌన్‌ కావడంతో ‘బందోబస్తు’ సినిమా ప్రమోషన్స్‌ విషయంలో చిత్ర యూనిట్‌ కాస్త తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాని మోహన్‌లాల్‌ యాంగిల్‌ నుండి ప్రమోట్‌ చేస్తున్నారు. డైరెక్ట్‌గా చెప్పాలంటే మోహన్‌లాల్‌ ఫోటోతో సినిమాకి హైప్‌ తీసుకొస్తున్నారనుకోండి. ఈ వరస చూస్తుంటే, వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న సూర్యని కాపాడే బరువు బాధ్యత ఇన్‌డైరెక్ట్‌గా మోహన్‌లాల్‌ చేతిలో పెట్టేసినట్లే కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో సూర్య, మోహన్‌లాల్‌తో పాటు, బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్యనే ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఆర్య, సాయేషా జంట ఈ సినిమాకి మరో స్పెషల్‌ అట్రాక్షన్‌. ఇక డైరెక్టర్‌ విషయానికి వస్తే, ‘రంగం’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి.ఆనంద్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ‘రోబో’ వంటి అద్భుతమైన చిత్రాలను రూపొందించిన లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...