Switch to English

‘ఇస్మార్ట్‌’ రొమాన్స్‌ ఈ భంగిమలేంటి.. జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

మాస్‌ మసాలా డైరెక్టర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ పూరీ జగన్నాధ్‌. ఆయన సినిమాల్లో హీరోయిన్లు ఎంత హాటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మాటికొస్తే, సీనియర్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారు హీరోయిన్స్‌ నడుం మీద రకరకాల పండ్లను ఆటలాడించి, వారి అందాల్ని అందంగా చూపిస్తే, ఆ పండ్ల గోలేం లేకుండానే మన జగన్‌ సార్‌.. అదేనండీ పూరీ జగన్‌ గారు అంతకంటే అందంగా గ్లామరస్‌గా చూపిస్తారు హీరోయిన్స్‌ని.

ఇక హీరోల సంగతి చెప్పనే అక్కర్లేదు. పక్కా లోకల్‌. మాస్‌.. ఊరమాస్‌.. అంతే. అక్కడున్నది మహేష్‌ అయినా, రామ్‌ అయినా ఆ మాటికొస్తే కొత్త హీరో అయినా సరే, పూరీ హీరో అంటే ఆ కిక్కే వేరప్పా అనే లెక్కల్లో తమని తాము మౌల్డ్‌ చేసేసుకోవాల్సిందే. సరే ఈ ఇన్‌ఫో అంతా బాగానే ఉంది కానీ, ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం తెలుసు కదా.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. హీరో తీరు అదే మాస్‌ ఊరమాస్‌ కా బాప్‌.. ఇక హీరోయిన్స్‌ ఒక్కరు కాదు, ఇద్దర్ని సెలెక్ట్‌ చేసుకున్నారు మన జగన్‌ గారు.

మనిసన్నాక కూసింత కళాపోసణ ఉండాలి కదా.. అని అప్పుడెప్పుడో చెప్పిన ఆ పెద్దాయన మాటను ఈయన బాగా ఫాలో అయిపోతుంటారు. అందుకే కథ డిమాండ్‌ చేసిందా.. ఇక అంతే రెచ్చిపోయి ఇద్దరేంటి.. ముగ్గురినైనా హీరోయిన్స్‌గా ఇరికించేయగల సత్తా ఉన్న డైరెక్టర్‌ ఈయన. ఇక మన ఇస్మార్ట్‌ గాళ్స్‌ విషయానికి వచ్చేద్దాం. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ ఈ ఇద్దరే ఈ సినిమాలో ఇస్మార్ట్‌ గాళ్స్‌. ఈ ఇస్మార్ట్‌ గాళ్స్‌తో మన ఇస్మార్ట్‌ శంకర్‌ చేస్తున్న రొమాంటిక్‌ హంగామా మామూలుగా లేదండోయ్‌. రిలీజ్‌ చేస్తున్న ఒక్కో పోస్టర్‌ పిచ్చెక్కించేస్తోంది.

ఇద్దరు హీరోయిన్స్‌తో శంకర్‌ ఆ కెమిస్ట్రీ ఏంటీ.? పాపులర్‌ శృంగార మూవీ (కామసూత్ర)ని తలపించేలా ఆ భంగిమలేంటీ.? అంటూ చర్చలు మొదలెట్టేశారు జనం. నిధి అగర్వాల్‌ హాట్‌నెస్‌కి కొద్దో గొప్పో ఆడియన్స్‌ అలవాటు పడ్డారు. కానీ, ఆ రెండో భామ ఉందే నభా నటేష్‌ ఆమె గ్లామర్‌ మాత్రం కూసింత కొత్తగానే కనిపిస్తోందండోయ్‌. ఎందుకంటే ఆమె తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’లో చాలా పద్థతిగా కనిపించింది మరి. ఈ సినిమా కోసం పూర్తిగా పద్ధతి వదిలేసి, పూరీ హీరోయిన్‌గా మారిపోయింది చూశారూ.. ఆ మేకోవర్‌ మెచ్చుకోవాల్సిందే.

ఏది ఏమైతేనేం, మొత్తానికి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఇస్మార్ట్‌ గ్లామర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపించేలా ఉంది ఇప్పటికైతే. ఇక పూర్తిగా మాట్లాడుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇంతకీ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో ఐడియా ఉంది కదా.. జూలై 18. వాస్తవానికి జూలై 12 నే విడుదల కావాల్సి ఉంది. కానీ, వరల్డ్‌ కప్‌ దెబ్బకి మన ఇస్మార్ట్‌ శంకర్‌ కాస్త ముందు చూపు వహించి కాస్త వెనక్కి జరగడంతో, లేటైనా లేటెస్ట్‌ రొమాన్స్‌తో జూలై 18న ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడన్నమాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

వైనాట్ 175 అటకెక్కింది.! ఓన్లీ పిఠాపురం చుట్టూ వైసీపీ గింగరాలు తిరుగుతోంది.!

అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే...