Switch to English

మహిళా కానిస్టేబుల్‌కి వైసీపీ మార్కు బెదిరింపు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఏదో సినిమా థియేటర్లో ఆకతాయిలెవరో సీట్లు పగలగొడితే.. దాన్ని జనసేన పార్టీకి ఆపాదించింది బులుగు పార్టీ.! డీ-మార్ట్ స్టోర్‌లో జరిగిన ఆకతాయి పనికి కూడా జనసేన పార్టీని వివాదంలోకి లాగింది బులుగు పార్టీ.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే బులుగు రాజకీయాలు ఇలాగే వుంటాయ్.

మరి, వైసీపీ నేత కుమారుడొకడు.. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మహిళా కానిస్టేబుల్ మీద దాడి చేస్తే.. దాన్ని వైసీపీకి ఆపాదించాలా.? వద్దా.? కోటిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ వార్డు మెంబర్ కొడుకు. వైసీపీ నేత కదా, ఆ మాత్రం కండకావరం వుంటుంది. ఆ కండ కావరంతోనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మహిళా కానిస్టేబుల్ మీద దురుసుగా ప్రవర్తించాడు. ఉద్యోగం పోతుందేమోనని ఆలోచించలేదు ఆ మహిళా కానిస్టేబుల్. ఓ మహిళగా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. తన మీదకు దూసుకొచ్చిన కోటిరెడ్డికి చెంప ఛెళ్ళుమనిపించింది. ఈ క్రమంలో కోటిరెడ్డి ఎన్ని బెదిరింపులకు దిగినా, అస్సలేమాత్రం తగ్గలేదు ఆ మహిళా కానిస్టేబుల్. ఈ వ్యవహారం సోషల్ మీడియా లో వీడియో రూపంలో వైరల్ అయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరుపై అనేక విమర్శలొస్తున్నాయి. చాలామంది బాధ్యతగల అధికారులు వైసీపీ నేతల ఒత్తిళ్ళకు తలొగ్గుతున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ, ఈ మహిళా కానిస్టేబుల్ అలా కాదు. ధైర్యంగా నిలబడింది. అధికార పార్టీ నాయకుడి కొడుకు విషయంలో భయపడకపోతే, ఉద్యోగం పోతుందని ఏమాత్రం ఆలోచించలేదు.

ఇదిలా వుంటే, కోటిరెడ్డిపై చర్యల విషయమై పోలీసులు ఒకింత నాన్చివేత ధోరణి అవలంభించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకోపక్క, పోలీసులే దురుసుగా ప్రవర్తించారంటూ వైసీపీ స్థానిక నేతలు, సదరు మహిళా కానిస్టేబుల్ మీద గుస్సా అవుతున్నారు. ఆమెపై బదిలి వేటు వేయించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నారట.

అన్నట్టు, పోలీస్ స్టేషన్‌కి వచ్చే ముందు కోటిరెడ్డి చేసిన ఘనకార్యమేంటో తెలుసా.? గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ కంప్యూటర్లను ధ్వంసం చేయడం.

రాష్ట్రంలో మహిళల భద్రత గురించి గొప్పగా చెబుతోన్న వైసీపీ నాయకులు, తమ పుత్రరత్నాల్ని ఏకంగా మహిళా కానిస్టేబుల్ మీద దౌర్జన్యాలకు ఉసిగొల్పుతున్నారంటే.. ఇదీ, రాష్ట్రంలో శాంతి భద్రతల తీరు. ఒక ఎమ్మెల్సీనేమో, తన వద్ద పనిచేసిన డ్రైవరుని చంపేసి, డెడ్ బాడీని.. మృతుడి ఇంటికే స్వయంగా డోర్ డెలివరీ చేశాడని.. ఇంకొక ప్రజా ప్రతినిధి నగ్నంగా వీడియో కాల్ చేసి బుక్కయి పోయాడని.. ఆరోపణలు ఉండనే ఉన్నాయి.. ఇదీ వైసీపీ బులుగు రాజకీయం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...