Switch to English

మళ్ళీ పట్టాలెక్కనున్న త్రీ క్యాపిటల్స్.! నమ్మేదెవరు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

మూడు రాజధానుల పేరుతో మళ్ళీ హైడ్రామా షురూ కాబోతోంది. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లుని వైసీపీ సర్కారు ప్రవేశ పెట్టబోతోందట. ఈసారి ఉభయ సభల్లోనూ తమకు ఎలాంటి ఇబ్బందీ వుండబోదని వైసీపీ భావించడంలో వింతేముంది.?

ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇటు అసెంబ్లీలో పోరాడలేదు, అటు శాసన మండలిలోనూ ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి, మూడు రాజధానుల విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బందేమీ వుండకపోవచ్చు. వాస్తవానికి, గతంలోనూ చట్ట సభల్లో మూడు రాజధానుల బిల్లుని ఆమోదించేశాం.. అని ఘనంగానే చెప్పుకుంది వైసీపీ.

కానీ, ఏం జరిగింది.? న్యాయస్థానాల్లో మూడు రాజధానుల బిల్లుకి చుక్కెదురయ్యింది. తుది తీర్పు రాకుండానే, మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది.. హైకోర్టుకి ఈ మేరకు సమాచారమిచ్చి, అసెంబ్లీలో బిల్లుని వెనక్కి తీసేసుకున్నారు. అంతేనా, న్యాయస్థానాల పరిధి గురించి చట్ట సభల్లో చర్చ కూడా చేసింది వైసీపీ. దాని వల్ల కలిగిన ప్రయోజనమేంటి.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.

ఈసారి కూడా మూడు రాజధానుల బిల్లుని ప్రవేశ పెడితే పెట్టొచ్చు. లేకపోతే, ఇదంతా ఉత్త డ్రామాగా మిగిలిపోనూ వచ్చు.! సీపీఎస్ రద్దు చేశారా.? మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారా.? ప్రత్యేక హోదా తెచ్చారా.? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా.? కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు ఏమయ్యాయ్.? ఇలాగే వుంటుంది మూడు రాజధానుల వ్యవహారం కూడా. ఇంతకు మించి ఏదో చిత్తశుద్ధి వైసీపీకి వుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

కాకపోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజల్ని ప్రాంతాల వారీగా విడదీసి, రాజకీయ లబ్ది పొందేందుకు ఖచ్చితంగా వైసీపీ ప్రయత్నిస్తుంది. అందుకు మూడు రాజధానులే అసలు సిసలు అస్త్రం వైసీపీకి. ఒక్క రాజధానికే దిక్కు లేదు.. మూడు రాజధానులెలా కడతారు.? అన్న ఇంగితం ప్రజలకైతే వుంది. పాలకులకు వుండొద్దూ.? ప్రజలకు సైతం ఆ ఇంగితం లేదనే భావనలో అధికారపక్షం వుండడం వల్లనే ఇదంతా జరుగుతోంది.

వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి, ఆమోదించేసి.. ఏడాది కాలంలోనే మూడు రాజధానులు పూర్తి చేసేసి (?!) ఎన్నికలకు వెళ్ళాలని వైసీపీ అనుకుంటోందట.. అలాగని బులుగు మీడియా డబ్బా కొడుతోంది. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...