Switch to English

ఔను, కాపులు అమ్ముడుపోతారు: సీఎం జగన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన కళ్యాణ్ దిలీప్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘ఔను, కాపులు అమ్ముడుపోతారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర. కామనర్ లైబ్రరీ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న కళ్యాణ్ దిలీప్, ఆ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాల్ని వివిధ అంశాలపై కుండబద్దలుగొట్టేస్తుంటారు.

ఇటీవల ‘కాపు నేస్తం నిధుల విడుదల’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గం ఓట్లను చంద్రబాబుకి అమ్మేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా వున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ వీడియో చేశారు కళ్యాణ్ దిలీప్ సుంకర.

‘పవన్ కళ్యాణ్ అమ్మేస్తారా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, కాపు సామాజిక వర్గం మాత్రం అమ్ముడైపోవడానికి సిద్ధంగా వుంటుంది. ఈ విషయంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. రెడ్డి సామాజిక వర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పోటీగా ఎవరూ నిలబడరు. కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబుకి పోటీగా ఎవరూ నిలబడరు. కానీ, కాపు సామాజిక వర్గంలో చిరంజీవిని తొక్కేయడానికి కాపు నేతలే అత్యుత్సాహం చూపుతారు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ అంతే..’ అని కళ్యాణ్ దిలీప్ సుంకర అభిప్రాయపడ్డారు.

‘భీమవరంలో పవన్ కళ్యాణ్ స్థానికంగా వుండరన్నారు.. పాలకొల్లులో చిరంజీవి స్థానికంగా వుండరన్నారు.. ఆ ప్రచారం చేసింది కాపు సామాజిక వర్గానికి చెందినవాళ్ళే. హిందూపురంలో బాలకృష్ణ అక్కడి ప్రజలకు అందుబాటులో వున్నారా.? లేరు కదా.? కానీ, ఆయన్ని గెలిపించారు. కాపు సామాజిక వర్గానికీ, ఇతర సామాజిక వర్గాలకీ ఇదే తేడా..’ అని కళ్యాణ్ దిలీప్ చెప్పుకొచ్చారు.

‘మేం కాపు సామాజిక వర్గం.. అని చెప్పుకోవడానికి.. ఐకానిక్ లీడర్ ఎవరంటే చిరంజీవి పేరే చెప్పుకోవాలి. కానీ, చాలామంది కాపు నాయకులు, చిరంజీవిని రాజకీయంగా దెబ్బతీశారు. పవన్ కళ్యాణ్‌నీ దెబ్బ తీస్తున్నారు. వాళ్ళంతా కమ్మోళ్ళకో, రెడ్డిలకు అమ్ముడు పోయినట్లే కదా.? ఆ అభిప్రాయంతోనే బహుశా వైఎస్ జగన్ అలా అని వుంటారు..’ అన్నది కళ్యాణ్ దిలీప్ సుంకర విశ్లేషణ.

బానిసత్వానికి అలవాటు పడిపోయిన కొందరు కాపు సామాజిక వర్గ పెద్దల కారణంగానే రాజ్యాధికారానికి కాపు సామాజిక వర్గం దూరమైందని కళ్యాణ్ దిలీప్ సుంకర తన అభిప్రాయాన్ని కుండబద్దలుగట్టేశారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...